Ind vs Eng Second Test : కుర్రోళ్లు రెచ్చిపోయారు.. ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం
ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది.
Ind vs Eng Second Test
భారత్ యువ టీం విదేశీ గడ్డపై విజయం సాధించింది. ఇంగ్లండ్ ను రెండో టెస్ట్ లో చిత్తుగా ఓడించింది. సమిష్టి కృషితో రాణించి వారి సొంత మైదానంలోనే టీం ఇండియా కసి తీర్చుకుంది. ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. 336 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి టెస్ట్ లో చేజేతులా చేజార్చుకున్న మ్యాచ్ ను తిరిగి అందిపుచ్చుకుంది. భారత్ లో అంతా కుర్రోళ్లు. సీనియర్లు లేని ఈ జట్టును ఇంగ్లండ్ తక్కువగా అంచనా వేసింది. అందులోనూ తమ దేశంలో తమపై విజయం అంటే ఇంగ్లండ్ అస్సలు ఊహించి కూడా ఉండదు.
దిమ్మతిరిగే కౌంటర్...
యువ ఆటగాళ్లు మాత్రం ఇంగ్లండ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. భారత్ లో సీనియర్లు లేకున్నా ఒకటేనని, ఆటతీరు మారదని నిరూపించారు. దీంతో ఐదు టెస్ట్ ల సిరీస్ ను భారత్ జట్టు సిరీస్ ను 1 -1 గా సమం చేసింది. దెబ్బకు దెబ్బతీసిన గిల్ సేన మైదానంలో పండగ చేసుకుంది. ఇక బౌలర్లలో యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్ లు విజృంభించి ఆడగా, ఇంగ్లండ్ బ్యాటర్ల వెన్నును మన బౌలర్లు సిరాజ్, ఆకాశ్ దీప్ విరిచేశారు. రెండో టెస్ట్ ఆరంభం నుంచే భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
వికెట్లను తీసి...
608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 271 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆకాశ్ దీప్ ఈ మైదానంలో ఆరు వికెట్లు తీయడం విశేషం. ఇంగ్లండ్ లో అత్యధిక పరుగులు చేసింది జెమీ స్మిత్. అతను 88 పరుగులు చేశఆడు. తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగుల చేసి భారత్ ఆల్ అవుట్ కాగా, ఇంగ్లండ్ 407 పరుగులకు చేసి అవుటయింది. తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్ ను 427 వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడటం, మన బౌలర్లు వికెట్లు అందిపుచ్చుకోవడతో రెండో టెస్ట్ లో భారత్ అద్భుతమైన, అపూర్వ మైన విజయాన్ని ఇంగ్లండ్ నుంచి అందుకుంది. ఇక మూడో టెస్ట్ గురువారం నుంచి లార్డ్ట్స్ లో ప్రారంభం కానుంది.