Breaking : తొలి వన్డేలో భారత్ ఘన విజయం

ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది

Update: 2023-03-17 15:13 GMT

తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. అయితే తొలి ఇరవై ఓవర్లు ఆసిస్ బ్యాటర్లు నిలకడగా ఆడటంతో స్కోరు మూడు వందలకు చేరుకుంటుందని భావించారు. కానీ మహ్మద్ షమీ మూడు, సిరాజ్ మూడు, రవీంద్ర జడేజా రెండు, కులదీప్, హార్థిక్ ప్యాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలవుట్ అయింది.

కేెఎల్ రాహుల్, జడేజా భాగస్వామ్యం...
189 ఛేదనకోసం బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు తొలి ఓవర్లలోనే తడబడ్డారు. వరసగా వికెట్లు పడినా కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకోవడంతో భారత్ విజయం సాధ్యమయింది. కేఎల్ రాహుల్ 75పరుగులు చేశాడు. జడేజా కూడా అండగా నిలవడంతో గెలుపు సులువుగా మారింది. జడేజా 45 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్, విరాట్ కొహ్లి, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలు పెద్దగా స్కోరు చేయకుండానే వెనుదిరగడంతో ఒకదశలో ఇండియా ఓటమి పాలవుతుందని అనుకున్నారు. కానీ కేఎల్ రాహుల్, జడేజా నిలకడగా ఆడటంతో టీం ఇండియా ఘన విజయం సాధించింది


Tags:    

Similar News