India vs New Zealand : నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే
భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే నేడు గౌహతిలో జరగనుంది
భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే నేడు గౌహతిలో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టీ20లలో టీం ఇండియా విజయం సాధించి ఐదు మ్యాచ్ ల సిరీస్ పై భారత్ 2 - 0 స్కోరుతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్ కూడా భారత్ గెలిస్తే సిరీస్ రెండు మ్యాచ్ లకు ముందే నెగ్గినట్లే. మరొకవైపు న్యూజిలాండ్ రెండు మ్యాచ్ లు ఓడిపోయి కసెక్కి ఉంది. మూడో మ్యాచ్ లో అయినా గెలిచి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని కివీస్ తహతహలాడుతుంది. దీంతో గౌహతి లో గెలుపెవరది? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.
రెండు మ్యాచ్ లలో గెలిచి...
భారత్ రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించడం అంత సులువుగా కాలేదు. నాగపూర్ లో జరిగిన తొలి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 238 పరుగులు చేసినప్పటికీ న్యూజిలాండ్ కేవలం 48 పరుగులు తేడాతో మాత్రమే ఓటమి పాలయింది. అయితే రాయపూర్ లో జరిగిన రెండో మ్యాచ్ లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 208 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం భారత్ సులువుగా విజయం సాధించింది. తొలి రెండు వికెట్లు ఆరు పరుగులకే కోల్పోయినా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదనలో తమకు తిరుగులేదని నిరూపించుకుంది.
న్యూజిలాండ్ కూడా...
ఇక గౌహతిలో జరిగే మ్యాచ్ లో ఇటు టాస్ తో సంబంధం లేకుండా ఆడేందుకు టీం ఇండియా సిద్ధమవుతుంది. భారత్ మూడో మ్యాచ్ లో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది. జస్ప్రిత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు లేకుండానే ఈ మ్యాచ్ లో గెలవడంతో కొంత భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. టీ20 వరల్డ్ ఛాంపియన్ షిప్ సమీపిస్తున్న సమయంలో భారత్ కు ఈ మ్యాచ్ లన్నీ ప్రిపరేషన్ మ్యాచ్ లే. ఇక న్యూజిలాండ్ కూడా మంచి పట్టుదలతో ఉండటంతో నేడు గౌహతిలో జరిగే మ్యాచ్ ఎటువైపు మొగ్గు చూపుతుందన్నది చూడాలి.