India vs New Zealand : నేడు భారత్ - న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్

భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు రాయ్ పూర్ లో జరగనుంది.

Update: 2026-01-23 02:25 GMT

భారత్ - న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు రాయ్ పూర్ లో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో గెలిచిన ఉత్సాహంతో టీం ఇండియా ఉంది. అలాగే తక్కువ పరుగులతోనే ఓటమి పాలయిన న్యూజిలాండ్ కూడా రెండో మ్యాచ్ లో విజయం సాధించాలని కసితో ఉంది. కానీ టీం ఇండియా తొలి టీ 20 మ్యాచ్ లో గెలిచింది కానీ అనే తప్పులు టీం ను ఇబ్బందులు పెడుతున్నాయి. ఫీల్డింగ్ లో లోపాలు స్పష్టంగా టీం ఇండియా బలహీనతలను చాటి చెబుతున్నాయి.

బ్యాటింగ్ లోనూ...
బ్యాటింగ్ లో భారీగా పరుగులు చేసినా అది అభిషేక్ శర్మ వల్లనే సాధ్యమయింది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లు రాణించలేకపోవడం కూడా కొంత క్రికెట్ అభిమానులను కలవరపరుస్తుంది. అదే అభిషేక్ కనుక త్వరగా అవుట్ అయి ఉంటే మన పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. ఏ మాత్రం తక్కువ స్కోరు చేసినా న్యూజిలాండ్ సులువుగానే లక్ష్యాన్ని ఛేధించి ఉండేది. దీంతో పాటు అంది వచ్చిన అవకాశాలను ఆటగాళ్లు చేజేతులా జారవిడవటం కూడా టీం ఇండియా ఫీల్డింగ్ పరంగా వెనక పడిందని చెప్పాలి.
ఫీల్డింగ్ లోనూ...
రెండు క్యాచ్ లు ను వదలిశారు. ఒక రనౌట్ మిస్ చేసుకున్నారు. చెత్త ఫీల్డింగ్ తో టీం ఇండియా ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అది న్యూజిలాండ్ కు అందివచ్చే అవకాశాలు లేకపోలేదు. రింకూసింగ్, ఇషాన్ కిషన్ లు మంచి క్యాచ్ లు మిస్ చేశారు. న్యూజిలాండ్ ఆటగాళ్లను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. వారు నిలదొక్కుకుంటే సులువుగా భారీ స్కోరు చేయగలరు. అందుకే ఈ మ్యాచ్ లో ఒళ్లుదగ్గర పెట్టుకుని ఆడాలని పలువురు క్రీడా నిపుణులు కూడా సూచిస్తున్నారు. టీ 20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న సమయంలో బలహీనతలను భారత జట్టు అధిగమించాలంటే ఇప్పటి నుంచే మైదానంలో వడివడిగా కదిలి జట్టు గెలుపునకు దోహదపడాలి.


Tags:    

Similar News