Asia Cup : క్షమాపణ చెప్పాడు..ట్రోఫీ ఇవ్వడానికి మాత్రం?
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ విజయం సాధించినప్పటికీ ట్రోఫీ అందుకోలేదు.
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ విజయం సాధించినప్పటికీ ట్రోఫీ అందుకోలేదు. ఏసీసీ ఛైర్మన్ మోసిన నఖ్వీ ఆ ట్రోఫీతో పాటు ఆటగాళ్ల మెడల్స్ ను కూడా తనతో పాటు పాక్ కు పట్టుకుని వెళ్లాడు. ఏసీసీ ఛైర్మన్ మోసిన నఖ్వీ ద్వారా తాము ట్రోఫీ తీసుకోబోమని భారత జట్టు చెప్పడంతో నఖ్వీ ట్రోఫీని తన వెంట తీసుకెళ్లాడు. దీనిపై పెద్దయెత్తు విమర్శలు వినిపించాయి. అయితే ఆసియా కప్ లో భారత జట్టుకు గెలిచిన ట్రోఫీ ఇవ్వకపోడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ట్రోఫీని, మెడల్స్ ను తన వద్దే ఉంచుకోవాలని...
ఏజీఎంతో ఆసియా కప్ అసోసియేషన్ లో తన నిరసనను కూడా బీసీసీఐ వ్యక్తం చేసింది. దీంతో ఏసీసీ ఛైర్మన్ మోసిన నఖ్వీ క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయినా సరే ట్రోఫీని, మెడల్స్ ను తమ వద్దనే ఉంచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. ట్రోఫీ, మెడల్స్ పై ఏసీసీ ఛైర్మన్ మోసిన నఖ్వీ క్లారిటీ ఇవ్వకపోడంపై బీసీసీఐ తీవ్రంగా అభ్యంతరం తెలుపుతుంది.