India vs South Africa : టాస్ గెలిచిన భారత్

ముల్తాన్ పూర్ లో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచింది

Update: 2025-12-11 13:21 GMT

ముల్తాన్ పూర్ లో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచింది. భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. న్యూ చండీగఢ్ లోని ముల్తాన్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు కీలకం. కటక్ లో ఘన విజయం సాధించిన భారత్ మంచి ఊపు మీదుంది.

తొలుత ఫీల్డింగ్...
కటక్ లో 101 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని శ్రమిస్తుంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టులో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ లో కూడా సంజూ శాంసన్ కు చోటు దక్కలేదు. తొలుత ఫీల్డింగ్ చేసి తక్కువ పరుగులకు అవుట్ చేసి భారత్ లక్ష్యాన్నిఅధిగమించాలన్న వ్యూహంతో తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది.


Tags:    

Similar News