India vs England : రోహిత్ సేన ఈ మైదానంలో రచ్చ రచ్చ చేయనుందా? అందుకు కారణమిదేనా?

భారత్ నేటి నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది

Update: 2024-01-25 03:26 GMT

భారత్ నేటి నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. ఇరు జట్లు తొలి టెస్ట్‌ను గెలుచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో తొలి టెస్ట్ హైదరాబాద్‌లో జరగనుంది. తర్వాత మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ గెలవడం అంటే ఆషామాషీ కాదు. అయితే ఒకటే అనుకూలమైన అంశం. సొంత మైదానంలో ఆడుతుండటమే భారత్ కు కొంత అనుకూలించే అంశమైనా విరాట్ కొహ్లి లేకపోవడం కొంత ఇబ్బంది అని క్రీడా పండితులు చెబుతున్నారు.

బౌలింగ్, బ్యాటింగ్ లో...
ఉప్పల్ స్టేడియం సీమర్లకు అనుకూలిస్తుందని అంచనాలున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే స్టేడియంలో టిక్కెట్లు అమ్ముడు పోయాయి. టీం ఇండియా క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. వరసగా మూడు రోజులు సెలవు దినాలు రావడంతో రేపటి నుంచి స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ లు కొనసాగే అవకాశాలున్నాయి. వీరితో పాటు శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జడేజా, భరత్ వంటి వారితో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.
ఇంగ్లండ్ కూడా...
దీంతో పాటు బౌలర్లలో అశ్విన్, జడేడా, సిరాజ్, బూమ్రా కూడా ఉండటంతో బౌలింగ్ పరంగా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇంగ్లండ్ టీంను తీసిపారేయడానికి వీలులేదు. అది బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా ఉంది. బౌలింగ్ లో మార్క్‌వుడ్, బెన్‌స్టోక్స్, జోరూట్ లు ఉన్నారు. ఇక బ్యాటింగ్ లో జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీపోప్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్ వంటి వారితో పటిష్టంగా ఉంది. అందుకే చివరి వరకూ మ్యాచ్ ఎవరిదన్నది అంచనా వేయలేని పరిస్థితి. భారత్ ఫ్యాన్స్ మాత్రం సహజంగానే తొలి టెస్ట్ ను మనమే గెలిచి సిరీస్ పై పైచేయి సాధించాలని కోరుకుంటున్నారు.


Tags:    

Similar News