నేడు భారత్ - శ్రీలంక తొలి టీ 20

భారత్ నేడు శ్రీలంకతో తొలి టీ 20 ఆడనుంది. మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది

Update: 2023-01-03 04:17 GMT

భారత్ నేడు శ్రీలంకతో తొలి టీ 20 మ్యాచ్ ఆడనుంది. మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. సిరీస్ ను స్వదేశీ గడ్డపై గెలుచుకోవాలని భారత్ తహతహలాడుతుంది. శ్రీలంక కూడా తన సత్తా చాటాలని భఆవిస్తుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, కెఎల్ రాహుల్ ను దూరం పెట్టింది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోనే ఈ సిరీస్ జరగనున్నాయి.

యువ ఆటగాళ్లతో....
మొత్తం యువ ఆటగాళ్లతో టీం ఇండియా ఉంది. మిషన్ 2024 టార్గెట్ గా హార్థిక్ పాండ్యా జట్టును ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశముంది. శుభమన్ గిల్ పేరు కూడా పరిశీలనలోనే ఉంది. సూర్య కుమార్ యాదవ్ ఈ సిరీస్ ను గెలిపించే బాధ్యతను భుజానకెత్తుకోవాలని అభిమానులు కోరుతున్నారు. సూర్య హిట్ అయితే చాలు.. భారత్ భారీ స్కోరు చేస్తుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. ఈ జట్టులో యువకులకు స్థానం కల్పించడంతో వారు తమను తాము నిరూపించుకోవడానికి ఈ సిరీస్ ఒక అవకాశం అని చెప్పాలి.


Tags:    

Similar News