Asia Cup : నేడు భారత్ తో శ్రీలంక మ్యాచ్ నామమాత్రమైనా?

ఆసియా కప్ లో ఫైనల్స్ కు ముందు భారత్ శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది.

Update: 2025-09-26 02:14 GMT

ఆసియా కప్ లో ఫైనల్స్ కు ముందు భారత్ శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ నామమాత్రమే. ఇప్పటికే భారత్ ఫైనల్స్ కు చేరడంతో ఈ మ్యాచ్ కేవలం టీం ఇండియా ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోనుంది. శ్రీలంక ఇప్పటికే ఆసియా కప్ నుంచి వైదొలగడంతో ఈ మ్యాచ్ పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో భారత్ జట్టు విజయం సాధించింది.

గెలిచినా.. ఓడినా...
శ్రీలంకతో జరిగే మ్యాచ్ లోనూ గెలిచి తమకు ఆసియా కప్ లో ఓటమి లేదని నిరూపించుకోవడానికి భారత్ ఈ మ్యాచ్ లో గెలవాల్సి ఉంది. సూపర్ ఫోర్ లో ఆడిన రెండు మ్యాచ్ లోనూ ఓటమి పాలు కావడంతో ఈ మ్యాచ్ లో గెలవాలని తహతహలాడుతుంది. భారత్ ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా దిగుతున్నప్పటికీ చివరికి ఎవరిది విజయం అన్నది చూడాల్సి ఉంది. నామమాత్రపు మ్యాచ్ లో భారత్ ఏదైనా జట్టులో మార్పులు చేస్తుందా? లేదా? ఇప్పటి వరకూ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుందా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News