Asia Cup : నేడు భారత్ - ఒమన్ మధ్య మ్యాచ్
నేడు ఆసియాకప్ లో భారత్ తన చివరిలీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఒమన్ తో దుబాయ్ లో టీం ఇండియా మ్యాచ్ నేడు ఆడనుంది.
నేడు ఆసియాకప్ లో భారత్ తన చివరిలీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఒమన్ తో దుబాయ్ లో టీం ఇండియా మ్యాచ్ నేడు ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సూపర్ 4లో అగ్రభాగాన నిలవాలని కోరుకుంటుంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు ఇది ప్రాక్టీస్ లా టీం ఇండియా ఉపయోగించుకోనుంది. ఇప్పటికే బారత్ యూఏఈ, పాకిస్తాన్ లపై గెలిచి సూపర్ 4కు చేరింది. ఈరోజు జరిగే మ్యాచ్ లోనూ గెలిచి సూపర్ 4లో అగ్రభాగాన నిలిచేందుకు ఈ మ్యాచ్ దోహదపడుతుంది.
టాస్ గెలిస్తే...
ఒకవేళ టాస్ గెలిస్తే ఈ మ్యాచ్ లో తొలుత టీం ఇండియా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచ్ లలో భారత్ ఛేజింగ్ లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ లో భారీ పరుగులు చేయాలన్న లక్ష్యంతో బ్యాటింగ్ ను ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీం ఇండియా ఈ మ్యాచ్ లో స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.