28/6 భారత్ దే పైచేయి

ఆసియా కప్ లో భారత్‌దే పైచేయి కనపడుతుంది. శ్రీలంక టాప్ ఆర్డర్‌ను భారత్ బౌలర్లు కూల్చివేశారు

Update: 2023-09-17 11:04 GMT

ఆసియా కప్ లో భారత్‌దే పైచేయి కనపడుతుంది. శ్రీలంక టాప్ ఆర్డర్‌ను భారత్ బౌలర్లు కూల్చివేశారు. హైదరాబాదీ ఆటగాడు సిరాజ్ తన సత్తా చాటి వరసగా వికెట్లు తీయడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. కుషాల్ పెెరా, నిస్పంక, అసలంక, సిల్వ, షనక, సమర విక్రమ అవుట్ అయ్యారు. దీంతో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి కేవలం ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీశాడు. జస్సిత్ బుమ్రా ఒక వికెట్ తీశారు.

హైదరాబాదీ ఆటగాడు...
ఆసియా కప్ ఫైనల్ ఏమాత్రం రంజుగా సాగడం లేదు. బారత్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు వరసగా అవుట్ కావడంతో అసలు వంద పరగులైనా శ్రీలంక చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్ నాలుగు ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీశాడు. ప్రస్తుతం వెల్లగా, మెండీస్ క్రీజులో ఉన్నారు. టాప్ ఆర్డర్ కుప్ప కూలి పోవడంతో భారత్ ఆసియా కప్ గెలుచుకునే అవకాశాలున్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత కప్ భారత్ సొంతమయ్యే ఛాన్స్ ఎంతో దూరం లేదు. వెల్లాగే నాలుగు, మెండిస్ పదిహేడు పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం తొమ్మిది ఓవర్లు మాత్రమే పూర్తయ్యయి.


Tags:    

Similar News