T20 World Cup : నేడు భారత్ - జింబాబ్వే మ్యాచ్
టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ లో నేడు జింబాబ్వాతో తలపడనుంది.
టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ లో నేడు జింబాబ్వాతో తలపడనుంది. చెన్నై వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవడమే కాదు.. భారీ స్కోరు నమోదు చేయగలిగితేనే సెమీ ఫైనల్స్ కు చేరుకునే అవకాశాలు మెరుగు పడతాయి. లేకుంటే ఆశలు అడుగంటి నట్లే. జింబాబ్వే చిన్న జట్టు కాదు. అది ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకట్టుకుంది.
భారీ స్కోరు చేస్తేనే...
అలాంటి జింబాబ్వేతో భారీ స్కోరుతో పాటు ఖచ్చితంగా విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్స్ రేసు ఆశలు ఇంకా కొనసాగుతాయి. రన్ రేట్ ఎక్కువగా ఉండాలి. అందుకే జట్టులో కొన్ని మార్పులతో నేడు బరిలోకి దిగే అవకాశముంది. అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ లకు చోటు కల్పించాలని జట్టు మేనేజ్ మెంట్ భావించవచ్చు. మరొకవైపు టాప్ ఆర్డర్ కూడా ఈ మ్యాచ్ నుంచి పుంజుకుంటేనే మంచి స్కోరు లభిస్తుంది.