T20 World Cup : ధనాధన్ మ్యాచ్ లకు వేళాయె.. నేడు భారత్ - అమెరికా మధ్య మ్యాచ్
టీ 20 ప్రపంచ కప్ కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది
టీ 20 ప్రపంచ కప్ కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ ఛాంపియన్ షిప్ లో దాదాపు ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ ను భారత్ - శ్రీలంక జాయింట్ గా ఆతిధ్యమిస్తున్నాయి. ఇరవై ఓవర్లలో ధనాధన్ మ్యాచ్ లకు వేళయింది. హిస్టరీ రిపీట్.. హిస్టరీ డిఫీట్ నినాదంతో టీం ఇండియా బరిలోకి దిగుతుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకూ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అంటే నెలరోజులు క్రికెట్ ఫ్యాన్స్ కు పండగ. ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో టీం ఇండియా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో పోటీ పడనుంది. రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతాయి.
హిస్టరీ చూస్తే...
ఇప్పటి వరకూ హిస్టరీ చూస్తే ఆతిధ్య జట్టు ఎవరూ టైటిల్ విన్నర్ గా నిలవలేదు. అలాగే ఏ టీం కూడా రెండోసారి వరసగా టైటిల్ ను అందుకోలేదు ఈ హిస్టరీని టీం ఇండియా బ్రేక్ చేస్తుందా? లేదా? అన్నది మాత్రమే చూడాలి. చరిత్రను తిరగరాయాలన్న పట్టుదలతో భారత్ ఉంది. టీ20 చరిత్రను తిరగరాయాలని భారత్ కసిగా బరిలోకి దిగుతుంది. అమెరికాతో పోటీ పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ టీం లో సరికొత్త రికార్డులను సృష్టించాలన్న ఉద్దేశ్యంతో టీం ఇండియా మైదానంలోకి కాలుమోపుతుంది. ప్రతి రోజూ మూడు మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. ఇరవై జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రూపులో టాప్ 2 గా నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ - 8 లోనూ ప్రతి జట్టు మరొక జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ సూపర్ 8 లో రెండు గ్రూప్ ల నుంచి టాప్ జట్లు సెమీ ఫైనల్స్ కు చేరతాయి.
ఈ మ్యాచ్ లు చూడాలంటే...
ఈ మ్యాచ్ లన్నీ వీక్షించాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్స్ లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ కు చెందిన అన్ని భాషల ఛానెల్స్ లో మ్యాచ్ లన్నీ ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గ్రూపు ఎ లో ఇండియా, పాకిస్తాన్, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్ ఉన్నాయి. అమెరికాతో జరిగే మ్యాచ్ లో భారత్ తొలి సారి బ్యాటింగ్ కు దిగి భారీ స్కోరుకు చేసే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు భారత్ టీ20 ప్రపంచకప్ జట్టు ఇలా ఉండనుంది.సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు ఆడనున్నారు. మరి అమెరికాతో జరిగే మ్యాచ్ లో ఏ ఏ రికార్డులు బద్దలవుతాయన్నది చూడాల్సి ఉంది.