India Vs England Fifth Test : ఇదేమి తడ "బ్యాట్" టం గురూ...ఐదో మ్యాచ్ లోనూ?

ఇండియా - ఇంగ్లండ్ మధ్య ఓవెల్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ప్రారంభంలోనే ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది

Update: 2025-08-01 02:16 GMT

ఇండియా - ఇంగ్లండ్ మధ్య ఓవెల్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ప్రారంభంలోనే ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. రెండు కీలక వికెట్లు తక్కువ పరుగులకే కోల్పోవడంతో భారత్ కొంత ఇబ్బందుల్లో పడింది. యశస్వి జైశ్వాల్ ఈ మ్యాచ్ లో కూడా విఫలమయ్యాడు. ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ వచ్చారు. యశస్వి జైశ్వాల్ రెండు పరుగులు చేసి వెనుదిరిగాడు. యశస్వి జైశ్వాల్ స్థానంలో సాయి సుదర్శన్ వచ్చాడు. అయితే ఆ వెంటనే కెల్ రాహుల్ అవుట్ అయి అందరికీ షాక్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ కేవలం పథ్నాలుగు పరుగులకే అవుటయ్యాడు. దీంతో టీం ఇండియా 38 పరుగులకే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది.

ఇద్దరి జోడీతో...
దీంతో శుభమన్ గిల్ వచ్చాడు. సాయి సుదర్శన్, శుభమన్ గిల్ జోడీలు కలసి పోరాడుతున్నారు. ఇద్దరు కలసి 72 పరుగులు చేయగలిగారు. వికెట్ పడకపోవడంతో భారత్ అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే 72 పరుగులు వద్ద ఓవల్ మైదానంలో వర్షం కురవడం ప్రారంభమయింది. వర్షం కురవడం ఆగిపోవడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఏడు గంటల వరకూ మ్యాచ్ ప్రారంభం కాలేదు. అయితే రెండు కీలకమైన వికెట్లు కోల్పోవడంతో భారత్ బ్యాటర్లపై భారం పడినట్లే కనపడుతుంది. నిలకడగా రాణిస్తేనే భారత్ తగిన స్కోరు చేసే అవకాశముంది. ఏ మాత్రం మరో రెండు వికెట్లు పడిపోయినా తర్వాత వచ్చే బ్యాటర్లు ఒత్తిడికి గురవుతారన్నది వాస్తవం.
ఆరు వికెట్లు కోల్పోయి...
అయితే నిన్న ఆటముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేసింది. కరుణ్ నాయర్ ఈ మ్యాచ్ లో 52 పరుగులు చేసి బ్యాటింగ్ లో ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సాయి సుదర్శన్ 38 పరుగులకు అవుట్ కాగా, శుభమన్ గిల్ 21 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు. జడేజా 9 పరుగులకే వెనుదిరగగా, ధ్రువ్ జురెల్ 19 పరుగులను మాత్రమే చేశాడు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడిందని చెప్పాలి. చివరి టెస్ట్ లోనూ టాస్ ఇంగ్లండ్ కే పడింది. ఈ ఐదు మ్యాచ్ లలో వరసగా టాస్ మాత్రం శుభమన్ గిల్ కు అనుకూలంగా పడలేదు. ఈరోజు కరుణ్ నాయర్, వాష్టింగ్టన్ సుందర్ నిలబడితే ఒకరమైన స్కోరు లభిస్తుంది. లేదంటే తక్కువ స్కోరుకే వెనుదిరగాల్సి వస్తుంది.


Tags:    

Similar News