India Vs South Afrcia : భారత్ ఓటమికి ఎన్నో కారణాలు.. క్రీడా పండితులు చెప్పేవివే

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య ముల్తాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది

Update: 2025-12-13 04:09 GMT

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య ముల్తాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. భారత్ ఓటమికి అనేక కారణాలున్నాయంటున్నారు. టాస్ గెలిచిన భారత్ అసలు ఫీల్డింగ్ ఎంచుకోవడమే అసలైన తప్పిదమని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. పిచ్ రిపోర్టు విషయం తెలిసినా టీం ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని ఘోరమైన తప్పిదం చేసిందని అన్నారు. ఛేజింగ్ లో భారత్ కు ఎదురులేని రికార్డులున్నప్పటికీ రాత్రి వేళ ఛేజింగ్ అంత అనుకూలం కాదని క్రీడా పండితులు చెబుతున్నారు.

టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం...
ఇక ఓపెనర్లు శుభమన్ గిల్, అభిషేక్ శర్మలు రెండు మ్యాచ్ లలోనూ ఘోర వైఫల్యం చెందారు. టాప్ ఆర్డర్ సక్రమంగా లేనప్పుడు వత్తిడి మిగిలిన ఆటగాళ్లపై పడుతుంది. కటక్ లో జరిగిన మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా నిలబడి ఆడాడు కాబట్టి గెలిచారు. కానీ ముల్తాన్ పూర్ లో వరసగా వికెట్లు పడిపోయినా తిలక్ వర్మ ఒంటరిపోరు అంతటి భారీ స్కోరును ఛేదించలేకపోయింది. 51 పరుగుల తేడాతో రెండో మ్యాచ్ లో ఓటమికి భారత్ చేతులారా చేసుకున్న తప్పిదాలే ప్రధాన కారణాలన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఈ నెల 14వ తేదీన మరొక మ్యాచ్ జరగనుంది.
అనేక తప్పిదాలు...
ముల్తాన్పూర్ లో ఈ ఏడాది జరిగిన ఐదు మ్యాచ్ లలో ఒక్కసారి మాత్రమే ఛేజింగ్ చేసిన జట్టు గెలిచిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ అతి విశ్వాసానికి టీం ఇండియా పోయినట్లే కనిపించింది. ఇక అర్షదీప్ వంటి బౌలర్లు అన్నివైడ్లు వేయడం పై కూడా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. పదిహేను వరకూ వైడ్ బాల్స్ అర్షదీప్ సింగ్ వేయడం కూడా మ్యాచ్ లో జరిగిన లోపంగా చూడాలంటున్నారు. ఇప్పటికైనా టీం ఇండియా సరైన దిశగా వ్యవహరించి ఈనెల 14న ధర్మశాలలో జరిగే మూడో మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని ఆశిద్దాం.


Tags:    

Similar News