వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్

ఐసీసీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ ఎంపికయ్యింది. ఓవల్ వేదికగా జూన్ 7వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది.

Update: 2023-03-13 07:32 GMT

ఐసీసీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ ఎంపికయ్యింది. ఓవల్ వేదికగా జూన్ 7వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది. శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఇది సాధ్యమయింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. శ్రీలంక జట్టు 2 -0 తేడాతో న్యూజిలాండ్ పై టెస్ట్ మ్యాచ్ లో గెలిస్తే ఇండియా ఫైనల్ కు వెళ్లే అవకాశం లేదు.

జూన్ 7న...
అయితే తొలి టెస్ట్ లోనే శ్రీలంక మ్యాచ్ ను కోల్పోవడంతో భారత్ నేరుగా ఫైనల్ కు ప్రవేశించింది. 2021లో టీం ఇండియా ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలయింది. కానీ ఈసారి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈసారి ఆస్ట్రేలియాపై ఓవల్ లో గెలిస్తే రికార్డు సృష్టించినట్లే. ప్రపంచ ఛాంపియన్ షిష్ ను సాధించాలంటే జూన్ 7వ తేదీన జరిగే మ్యాచ్ లో భారత్ గెలవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News