India Vs England Thrid Test : ఇండియా - ఇంగ్లండ్ మధ్య స్కోర్లు సమం.. ఇక డ్రాగా ముగుస్తుందా?
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇండియా - ఇంగ్లండ్ మూడో టెస్ట్ డ్రా గా ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇండియా - ఇంగ్లండ్ మూడో టెస్ట్ డ్రా గా ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 387 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఇండియా కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అంటే స్కోర్లు సమంగా ఉన్నాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. రెండు జట్లు సమాన స్కోర్లకు ఆల్ అవుట్ కావడం దాదాపు పదేళ్ల తర్వాత ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. 2015లో ఒకసారి ఇలాగే జరిగిందని అంటున్నారు. ఈ రెండు రోజుల ఆటను ఇద్దరూ ఆచితూచి ఆడితే మాత్రం ఈ మ్యాచ్ డ్రా గా ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బ్యాటర్లు రాణించడంతో...
భారత్ ఓవర్ నైట్ స్కోరు 154 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయి ప్రారంభించింది. కెప్టెన్ శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్ వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడిందనిపించింది. కానీ కానీ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ నిలబడి ఆడారు. భారత్ స్కోరును పెంచడంలో మంచి ప్రదర్శన కనపర్చారు. కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 74 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు. ఇక రవీంద్ర జడేజా 72 పరుగులతో రాణించడంతో టీం ఇండియా 387 పరుగులను సాధించింది. మిగిలిన ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోవడంతో ఇండియా ఇంగ్లండ్ చేసిన స్కోరును అధిగమించలేకపోయింది.
ఇక రెండు రోజులు...
ఇక నిన్న రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే చేసి రెండు పరుగులు మాత్రమే చేసింది. జాక్ క్రాలీ రెండు పరుగులు చేశాడు. బెన్ డకెట్ క్రీజులో ఉన్నాడు. ఈరోజు అత్యంత వేగంగా ఇంగ్లండ్ బ్యాటర్లు అత్యధిక స్కోరు చేసి డిక్లేర్ చేసి భారత్ ను ఓడించాలన్న లక్ష్యం పెట్టుకునే అవకాశముంది. వేగంగా ఆడి కనీసం మూడు వందలకు పైగా పరుగులను లక్ష్యాన్ని విధించి భారత్ ఓడించాలన్న ఉద్దేశ్యంతో ఉండి ఉండవచ్చు. కానీ భారత్ బౌలింగ్ పరంగా చూస్తే అది సాధ్యం కాకపోవచ్చు. దీంతో భారత్ కూడా తక్కువ పరుగులకు ఇంగ్లండ్ ను ఆల్ అవుట్ చేసే అవకాశం లేదు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అద్భుతం జరిగితే తప్ప ఎవరికో ఒకరికి విజయం తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.