India Vs England 2nd Test : నేటి నుంచి భారత్ - ఇంగ్లండ్ రెండో టెస్ట్
ఇండియా - ఇంగ్లండ్ రెండో టెస్ట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎడ్జ్ బాస్టన్ లో రెండోటెస్ట్ ప్రారంభం కానుంది
ఇండియా - ఇంగ్లండ్ రెండో టెస్ట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎడ్జ్ బాస్టన్ లో రెండోటెస్ట్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లో మంచి పరుగులు చేసి సెంచరీలు సాధించినా బౌలింగ్ లో పస లేకపోవడం, ఫీల్డింగ్ లో ఇబ్బందులు పడటం టీం ఇండియాకు ఓటమిని తెచ్చిపెట్టాయి. లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ లో శుభమన్ గిల్, రిషబ్ పంత్ లు సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రెండో టెస్ట్ లో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమయింది. బజ్ బాల్ ఆటతో సిరీస్ తో ఇప్పటికే ఆధిక్యంతో ఉన్న ఇంగ్లండ్ సొంత గడ్డ మీద రెండోటెస్ట్ లోనూ విజయం సాధించాలని తహతహలాడుతుంద.ి
బుమ్రాను తీసుకొచ్చి...
ఈ మ్యాచ్ టీం ఇండియాకు కీలకం. అందుకే బుమ్రాకు విశ్రాంతినిచ్చి అర్షదీప్ సింగ్ ను తీసుకుందామని భావించినా ఆ ఆలోచన విరమించుకుని తిరిగి బుమ్రాను ఈ టెస్ట్ లో తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిన్నర్లు, పేసర్లు రాణించగలిగితేనే ఈ మ్యాచ్ లో భారత్ పట్టు బిగించే అవకాశాలున్నాయి. ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ లో పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే మరోసారి సెంచరీల మోత మోగుతుంది. భారత్ లో లోయర్ ఆర్డర్ వైఫల్యంతో ఇబ్బందులు పడుతుంది. లీడ్స్ లో బాగా ఓపెనర్లు ఆడినా లోయర్ ఆర్డర్ వైఫల్యంతో ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. అదే ఇంగ్లండ్ కు కలసి వచ్చింది.
లోయర్ ఆర్డర్ నిలదొక్కుకుంటే...
371 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు సులువుగా ఛేదించగలిగారు. అదే లోయర్ ఆర్డర్ లో ఒకరిద్దరు క్లిక్ అయి ఉన్నా మ్యాచ్ గెలవకపోయినా కనీసం డ్రా అయి ఉండేది. అయితే ఇప్పటికీ భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది. జైశ్వాల్, గిల్, పంత్ లు తొలి టెస్ట్ లో సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్ లో కూడా చెలరేగి ఆడే అవకాశాలున్నాయి. లీడ్స్ లో తొలి ఇన్నింగ్స్ లో 41 పరుగులకే ఏడువికెట్లు కోల్పోయిందంటే లోయర్ ఆర్డర్ ఎంతగా పేలవ ప్రదర్శన చేసిందో చెప్పకనే తెలుస్తుంది. అందుకే ఈ మ్యాచ్ ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్నీ అనుకూలిస్తే ఇంగ్లండ్ పై పై చేయి సాధించే అవకాశాలు మాత్రం ఉన్నాయి.