India vs South Africa: తొలి టీ20 భారత్ దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య కటక్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.

Update: 2025-12-10 02:00 GMT

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య కటక్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 101 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే పెద్దగా పరుగులు చేయకుండానే భారత్ వరసగా కీలకమైన వికట్లను కోల్పోయింది. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వరసగా అవుట్ అయినప్పటికీ భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.

రీ ఎంట్రీతో పాండ్యా...
హార్థిక్ పాండ్యా రీ ఎంట్రీతో అదరగొట్టాడు. పాండ్యా కేవలం 28 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సులు కొట్టి జట్టును 175 పరుగులకి చేర్చారు. తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23 కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించినప్పటికీ, భారత బ్యాటర్లు స్థిరంగా రాణించారు. శుభమన్ గిల్ నాలుగు పరుగులకే అవుటయ్యాడు. అభిషేక్ శర్మ 17 పరుగులకే వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ పన్నెండు పన్నెండు పరుగులు మాత్రమే చేసినా హార్ధిక్ పాండ్యా నిలబడి స్కోరును 175కు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి మూడు, సిపమ్లా రెండు, ఫెరారా ఒక వికెట్ ను పడగొట్టాడు.
ఛేజింగ్ లో తడబడి...
తర్వాత ఛేజింగ్ లో దక్షిణాఫ్రికా తడబడింది. భారత్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తింది. కేవలం దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. డేవాల్ బ్రేవిస్ మాత్రమే 22 పరుగులు చేసి కాస్త పరవాలేదనిపించాడు. మార్ క్రమ్ 14, ట్రిస్టన్ స్టబ్స్ పథ్నాలుగు, మార్కో యాన్సెన్ పన్నెండు పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికా టీ 20లలో అతి తక్కువ స్కోరు చేసిందని చెప్పాలి. భారత బౌలర్లంతా ప్రభావం చూపారు. అర్ష్‌దీప్ సింగ్ (2/14), వరుణ్ చక్రవర్తి రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. దీంతో దక్షిణాఫ్రికా ఘోరపరాజయం పాలయింది. భారత్ తనకు టీ20లలో తిరుగులేదని మరొకసారి నిరూపించుకుంది.


Tags:    

Similar News