India vs Australia: నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్
భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. మెల్ బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. మెల్ బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ కాన్ బెర్రాలో వర్షం కారణంగా రద్దయింది. రెండు జట్లకు చెరొక పాయింట్ సాధించాయి. మరొక నాలుగు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. మరొక మూడు మ్యాచ్ లలో గెలిస్తేనే సిరీస్ సొంతమవుతుంది. అందుకే నేడు మెల్ బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్ ఇటు భారత్ కు, అటు ఆస్ట్రేలియాకు కీలకమని చెప్పాలి. రెండు జట్లు టీ 20లలో హోరాహోరీ తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్యాటర్లు మాత్రమే...
భారత్, ఆస్ట్రేలియా మధ్య భారత కాలమానం ప్రకారం నేటి మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో ముగ్గురు మాత్రమే టీం ఇండియా ప్లేయర్లు బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అయితే బౌలర్లకు అవకాశం దక్కకుండానే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండో్ మ్యాచ్ లోనూ భారత జట్టు యధాతధంగా మైదానంలోకి దిగే అవకాశాలున్నాయి. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా స్ట్రాంగ్ గా ఉండటంతో గెలుపుపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి.
భారత్ జట్టు ఇదే...
నేడు జరగనున్న రెండో టీ 20 మ్యాచ్ కు భారత్ జట్టు అంచనా ఇదే. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకశముంది. ఆస్ట్రేలియాజట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్,తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా ఆడనున్నారు. ఈ టీం అలాగే కొనసాగుతుంది. ఈ టీం క్లిక్ అయితే మిగిలిన మ్యాచ్ లలో కూడా ఇదే జట్టును కూడా ఖరారు చేసే ఛాన్స్ లున్నాయి. ఈ మ్యాచ్ లో మరోసారి మనోళ్లు చెలరేగి పోవాలని ఆశిద్దాం.