India Vs Australia : ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతటే?
సిడ్నీ లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది.
సిడ్నీ లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. టాస్ గెలుచుకున్న ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే 236 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. 46.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియాకు చెందిన అందరూ బ్యాటర్లు అవుట్ కావడంతో 237 లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మ్యాట్ రెన్ షా యాభై ఆరుగులు అత్యధిక పరుగులు చేశాడు.
హర్షిత్ రాణా అత్యధికంగా...
టీం ఇండియా బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు, వాషింగ్టన్ సుందర్ రెండు, సిరాజ్, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో మొత్తం ఆరుగురు బౌలర్లు బౌల్ చేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ 41, ట్రావిస్ హెడ్ 29 పరుగులు చేారు. మథ్యూ షార్ట్ 30, అలెక్స్ కేరీ ఇరవై నాలుగు పరుగులు చేశాడు. ఇప్పుడు భారత్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. వైట్ వాష్ కాకుండా ఉండాలంటే భారత్ కు ఈ మ్యాచ్ లో విజయం అవసరం.