India Vs Australia : క్లీన్ స్వీప్ కాకుండా చూడండి స్వాములూ..!

భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది

Update: 2025-10-25 03:31 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లలో ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి పాలయి సిరీస్ ను చేజార్చుకుంది. పెర్త్, ఆడిలైడ్ లో దారుణమైన ఓటమిని భారత్ చవి చూడాల్సి వచ్చింది. సిడ్నీ మ్యాచ్ లో కూడా ఓడిపోతే ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. ఆస్ట్రేలియా సిరీస్ క్లీన్ స్వీప్ చేసి భారత్ కు స్ట్రోక్ ఇవ్వాలని భావిస్తుంది. అందుకోసమే గట్టిగా శ్రమిస్తుంది. మరొకవైపు భారత్ కూడా క్లీన్ స్వీప్ కాకుండా సిరీస్ లో ఒక్క మ్యాచ్ లోనైనా గెలిచి నిరూపించుకోవాలని తపన పడుతుంది. అందుకే ఈ మ్యాచ్ గెలవడానికి రెండు జట్లు శక్తివంచన లేకుండా పోటీ పడతాయి.

విరాట్, రోహిత్ లపైనే...
అయితే భారత్ టీం లో విరాట్ కోహ్లి ఫామ్ లే లేకపోవడం ఒకింత భయాన్ని కలిగిస్తుంది. రెండు వన్డేల్లోనూ కోహ్లి డకౌట్ అయ్యాడు. దీంతో విరాట్ కు ఇది ఆఖరి మ్యాచ్ అన్న ప్రచారం ఊపందుకుంది. రోహిత్ శర్మ మాత్రం పెర్త్ మ్యాచ్ లో విఫలమయినా, ఆడిలైడ్ లో మాత్రం అత్యధిక పరుగులు చేశాడు. 73 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ తో రిటైర్ అవుతారని అంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ల జంట ఒక్కసారిగా రిటైర్ అవుతారన్న ప్రచారం భారత క్రికెట్ ఫ్యాన్స్ కుఒకింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే టీ 20, టెస్ట్ మ్యాచ్ లలో ఇద్దరూ రిటైర్ మెంట్ ప్రకటించారు. ఇక వన్డేలోనైనా ఉంటారను కుంటే ఇలా జరుగుతుందేనన్న బాధ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.
అనుకూలంగా లేని లెక్కలు...
అయితే సిడ్నీలో భారత్ కు గణాంకాలు కూడా అంత అనుకూలంగా లేవు. సిడ్నీలో భారత్ గత ఐదు వన్డే మ్యాచ్ లు ఆడితే అందులో ఒక్క మ్యాచ్ మాత్రమే భారత్ గెలిచింది. మొత్తం పందొమ్మిది మ్యాచ్ లు సిడ్నీ మైదానంలో భారత్ ఆడితే అందులో రెండు మ్యాచ్ లలో మాత్రమే ఇండియా విజయం సాధించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. పదహారు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా గెలవగా, ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్ లో కూడా భారత్ టాప్ ఆర్డర్ తడబడితే సిడ్నీపై కూడా టీం ఇండియా ఆశలు వదులుకోవాల్సిందే. కానీ రోహిత్ శర్మ మాత్రం సిడ్నీలో రోహిత్ శర్మ నాలుగు వన్డేల్లో ఒక సెంచరీ చేశాడు. రెండు అర్థ సెంచరీలు చేశాడు. సిడ్నీలో గెలిచి భారత్ వైట్ వాష్ కాకుండా చూసుకోవాలని విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కులదీప్ యాదవ్ ను కూడా జట్టులోకి తీసుకోవడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News