India vs Australia : నేడు భారత్ ఆస్ట్రేలియా మూడో వన్డే

భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే నేడు జరగనుంది. సిడ్నీ వేదికగా జరుగుతుంది

Update: 2025-10-25 01:48 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే నేడు జరగనుంది. సిడ్నీలో జరగనున్న ఈ మ్యాచ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా భారత్ కాపాడుకునేందుకు శ్రమించాల్సి ఉంది. మరొకవైపు ఆస్ట్రేలియా సిరీస్ ను వైట్ వాష్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో స్వల్ప మార్పులతో భారత జట్టు బరిలోకి దిగే అవకాశముంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో పెర్త్, ఆడిలైడ్ లో ఓటమి పాలయిన భారత్ సిడ్నీలో ఎలాగైనా గెలిచి తమను తాము నిరూపించుకోవాలనుకుంటుంది.

సిడ్నీ వేదికగా...
భారత్ కు ఈ మ్యాచ్ గెలుపు అవసరం ఎక్కువగా ఉంది. విమర్శకుల నోళ్లు మూయించాలన్నా ఈ మ్యాచ్ లో భారత్ కు గెలవక తప్పని పరిస్థితి. అయితే బౌలర్ల విషయంలో మార్పులు జరిగే అవకాశముంది. కులదీప్ యాదవ్ కు ఈ మ్యాచ్ లో చోటు కల్పించే అవకాశాలున్నాయంటున్నారు. ఆస్ట్రేలియా సొంత గడ్డపైన భారత్ ను ఓడించి తన ప్రతాపమేంటో ప్రపంచానికి తెలియజేయాలనుకుంటుంది.


Tags:    

Similar News