India Vs Australia T20 : నేటి నుంచి భారత్ - ఆస్ట్రేలియా టీ 20 సిరీస్
భారత్ ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది
భారత్ ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇటీవల వన్దే సిరీస్ ను భారత్ కోల్పోయింది. పెర్త్, ఆడిలైడ్ లో ఓటమి పాలయిన భారత జట్టు చివరి మ్యాచ్ సిడ్నీలో మాత్రం గెలిచి పరవాలేదనిపించుకుంది. కానీ ఈ నెల 29వ తేదీ నుంచి టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత్ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. మొత్తం ఐదు మ్యాచ్ ల టీ సిరీస్ ను సొంతం చేసుకోవడానికి భారత జట్టు శ్రమిస్తుంది. వన్డేల్లో సిరీస్ ను కోల్పోయినప్పటికీ టీ20లలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని ప్రాక్టీస్ చేసింది.
మంచి రికార్డులతో...
టీం ఇండియా టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నారు. అయితే టీ 20 సిరీస్ కు స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా వచ్చేయడంతో భారత్ కు అదనపు బలం వచ్చినట్లయింది. టీ 20లలో భారత్ కు తిరుగులేని రికార్డు ఉంది. భారత్ జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి కూడా ఆడనున్నారు. హర్ధిక్ పాండ్యా గాయాల పాలు కావడంతో ఆయన స్థానంలో అర్షదీప్ సింగ్ ను తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఆస్ట్రేలియా జట్టు కూడా...
టీ20లలో ఆస్ట్రేలియా జట్టు కూడా బలంగానే ఉంది. ఆ జట్టుకు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఈ సిరీస్ లో ఎవరిది పై చేయి అవుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. ఈ నెల 29వ తేదీన కాన్ బెర్రాలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నెల 31వ తేదీన మెల్ బోర్న్ లో మ్యాచ్ జరగనుంది. నవంబరు 2వ తేదీన హోబర్ట్ లో భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. నాలుగో టీ 20 మ్యాచ్ గోల్డ్ కోస్ట్ లో జరగనుంది. ఐదో టీ 20 మ్యాచ్ గబ్బా వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే కాన్ బెర్రా చేరుకుని ప్రాక్టీస్ ను ముమ్మరం చేశాయి. మరి టీ 20 సిరీస్ ఎవరి పరం అవుతుందన్నది చూడాలి.