India vs Australia 2nd Onde Day : రెండో వన్డేలోనూ భారత్ ఓటమి.. బాధ్యులు వారేనా?
రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలయింది. ఆడిలైడ్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమయింది
రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలయింది. ఆడిలైడ్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ మాత్రమే రాణించగలిగారు. మిగిలిన బ్యాటర్లంతా రాణించకపపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి యాభై ఓవర్లలో 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో రోహిత్ శర్మ 73, శ్రేయస్ అయ్యర్ 61 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 44 పరుగులు చేసి పరావాలేదనిపించారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా సిరీస్ ను సొంతం చేసుకుంది.
టాప్ ఆర్డర్ మరోసారి...
విరాట్ కోహ్లి మరోసారి డకౌట్ గా నిలిచాడు. కెప్టెన్ శుభమన్ గిల్ తొలి వన్డేలో పది పరుగులు, రెండో వన్డేలో తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు, బార్ట్ లెట్ మూడు, మిచెట్ స్టార్క్ కు రెండు వికెట్లు దక్కాయి. 264 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్లలోనే సాధించారు. ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ ను గెలిచింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ 74 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. కూపర్ కనోలి 61 పరుగులు చేశాడు. మిచెల్ ఒవెన్ 36 పరుగుల చేయడంతో ఆస్ట్రేలియా విజయం ఖాయమైంది.
భారత్ లక్ష్యాన్ని...
భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్ తలో రెండువికెట్లు తీయగా, అక్షర్ పటేల్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. సరైన సమయంలో వికెట్లు తీయడంలో భారత్ బౌలర్లు విఫలం కావడంతో పాటు భారత్ టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం కారణంగానే సిరీస్ ను సమర్పించుకున్నారు. సీనియర్లు, యువకులతో కూడిన జట్టు అయినా కంగారూల ముందు చేతులెత్తేశారు. ప్రపంచ కప్ త్వరలో జరగనున్న నేపథ్యంలో భారత ఆటగాళ్ల తీరు ఇండియా ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తుంది.