India Vs Australia : మళ్లీ వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నాడుగా?

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ విజయంలో టీం ఇండియా బౌలర్లు కీలక పాత్రను పోషించారు

Update: 2025-11-07 02:01 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ విజయంలో టీం ఇండియా బౌలర్లు కీలక పాత్రను పోషించారు. నిజానికి బ్యాటర్లు ఒకరకంగా విఫలయమినట్లేనని అనుకోవాలి. చెప్పుకోదగ్గ స్కోరును చేయలేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. నిజానికి ఆస్ట్రేలియాకు ఇది పెద్ద టార్గెట్ కాదు. కానీ ఛేజింగ్ లో ఆస్ట్రేలియా వైఫల్యానికి భారత బ్యాటర్లు మాత్రమే కారణం. భారత బౌలర్లు సరైనసమయంలో వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా ఈ టీ20 మ్యాచ్ లో పరాజయం పాలయింది.

బ్యాటర్లు తక్కువ పరుగులు చేసినా...
ఓపెనర్లలో అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ కేవలం ఇరవై ఒక్క బాల్స్ ఆడి మూడు ఫోర్లు, ఒక సిక్స్ తో 28 పరుగులు చేశారు. అయితే కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 39 బంతులు ఆడి 46 పరుగులు చేశారు. గిల్ చేసిన పరుగులే ఈ మ్యాచ్ లో అత్యధికం. శివమ్ దూబె ఇరవై మూడు పరుగులు, సూర్యకుమార్ యాదవ్ ఇరవై పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. దీంతో మరోసారి గిల్ తప్పించి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లో విఫలమయిందనే చెప్పాలి. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా చెరో మూడు వికెట్లు తీయగా, బార్ట్ లెట్, స్టోయినిస్ చెరో వికెట్ తీశారు.
ఛేజింగ్ లో తడబడిన ఆస్ట్రేలియా...
అయితే ఛేజింగ్ లో ఆస్ట్రేలియా తడబడటానికి భారత బౌలర్లే కారణం. వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్ తో మూడు వికెట్లను తీయగలిగాడు. మూడో టీం 20 గెలుపునకు కారణమయిన వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ లోనూ విజయానికి కారణంగా నిలిచారు. అర్షదీప్ సింగ్, జస్ ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీయగా, అక్షర్ పటేల్, శివమ్ దూబె తలో రెండు వికెట్లు తీశారు. బౌలర్లు వేగంగా వికెట్లు తీయడం వల్లనే ఈ గెలుపు సాధ్యమయింది. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా కంటే భారత్ - 2-1 సిరీస్ లో ఆధిక్యతగా నిలిచిందనిచెప్పాలి. చివరి టీ 20 రేపు బ్రిస్బేన్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే టీ20 సిరీస్ సొంతమవుతుంది. ఓడిపోతే సమం అవుతుంది.


Tags:    

Similar News