India Vs Australia : నిరాశ పర్చిన రోకోలు.. ఇలా ఆడేకంటే?
India Vs Australia : నిరాశ పర్చిన రోకోలు.. ఇలా ఆడేకంటే రిటైర్ మెంట్ ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందేమోగా
చాలా కాలం తర్వాత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు నిరాశపర్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డే లో భారత్ ఘోర పరాజయం చూసింది. ఓటమి విషయం పక్కన పెడితే మైదానంలో వారి ఆటను చూసేందుకు ఎక్కువ మంది అభిమానులు వేచి ఉన్నారు. ఈ పర్యటన కోసమేవేకాచుక్కూర్చుని ఉన్నారు. అయితే తొలి వన్డేలో మాత్రం ఇద్దరూ ఆశించినంత రీతిలో రాణించకపోవడంతో పాటు ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోవడం కూడా వారు ఫామ్ లో లేరని క్రికెట్ ఫ్యాన్స్ కు కూడా తెలిసిపోయింది. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులకు అవుట్ కాగా, విరాట్ కోహ్లి డకౌట్ తో వెనుదిరిగాడు. భారత్ ఓటమి కంటే వీరిద్దరూ నిలకడలేనితనం ఫ్యాన్స గుండెను మెలి పెట్టిందనే చెప్పాలి.
తక్కువ పరుగులు చేయడంతో...
పెర్త్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రోహిత్ ఎనిమిది పరుగులు చేసి అవుటయ్యారు. పెర్త్ లో అనేకసార్లు వర్షం పడటంతో యాభై ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ డక్ వర్త్ లూయీస్ ప్రకారం మ్యాచ్ ను 26 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీం ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 38 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. అక్షర్ పటేల్ 31 పరుగులు చేసి తన వరకూ తాను న్యాయం చేశాడు. శుభమన్ గిల్ పది పరుగులు, శ్రేయస్ అయ్యర్ పదకొండు, వాషింగ్టన్ సుందర్ పది, నితీషర్ రెడ్డి పందొమ్మిది పరుగులు చేశారు.
ఓవర్లు మిగిలి ఉండగానే...
ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ మిచెల్ ఓవెన్, కునెమన్ తలో రెండు వికెట్లు తీసి భారత్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపారు. మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్ చెరో వికెట్ తీసుకున్నాడు. 137 పరుగులు లక్ష్యంతో బరిలోకిగి దిగిన ఆస్ట్రేలియా మరో 4.5 ఓవర్లు మిగిలి ఉండగానే అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్ 46 పరుగులు చేశాడు. జోష్ ఫిలిప్ 37 పరుగులు చేశాడు. రెన్ షా 21 పరుగులు చేశాడు. మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా భారత్ పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే రోహిత్, విరాట్ కోహ్లి రాణించకపోవడం మాత్రం నిరాశను మిగిల్చిందనే చెప్పాలి.