India vs Australia : నేడు భారత్ - ఆస్త్రేలియా టీ20 మ్యాచ్

భారత్ - ఆస్ట్రేలియాలో చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కీలకం కానుంది

Update: 2025-11-08 01:56 GMT

భారత్ - ఆస్ట్రేలియాలో చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కీలకం కానుంది. సిరీస్ ఎవరిదన్నది తేల్చనుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు టీ20 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో ఒకటి వర్షంతో రద్దు కాగా, రెండింటిలో భారత్, ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యతతో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ పరమవుతుంది. ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.

రెండు జట్లకూ కీలకం...
అందుకే ఈ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియాలకు కీలకం. రెండు జట్లు హోరాహోరీ తలపడనున్న ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత్ ఎలాగైనా టీ20 సిరీస్ ను గెలవాలన్న కసితో ఉంది. ఆస్ట్రేలియా కూడా సిరీస్ ను సమం చేయాలని శ్రమిస్తుంది. యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. మరొకవైపు భారత్ కూడా ఈ మ్యాచ్ లో స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News