India vs England Fifth Test : భారత్ చారిత్రాత్మక విజయం.. ఇంగ్లండ్ దారుణ వైఫల్యం.. సిరీస్ సమం

ఇంగ్లండ్ - ఇండియా మధ్య ఓవల్ లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది.

Update: 2025-08-04 11:27 GMT

ఇంగ్లండ్ - ఇండియా మధ్య ఓవల్ లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయానికి భారత్ బౌలర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కారణమని చెప్పకతప్పదు. 35 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించలేకపోయింది. అదే సమయంలో భారత్ బౌలర్లు నాలుగు వికెట్లు తీసి అపూర్వ మైన విజయాన్ని జట్టుకు అందించారు. దీంతో భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమం అయింది. ఇంగ్లండ్ రెండు మ్యాచ్ లలో గెలవగా, భారత్ రెండు మ్యాచ్ లలో గెలిచింది. మరో మ్యాచ్ డ్రాగా ముగియడంతో సిరీస్ సమంగా మారింది.

ఉత్కంఠ భరితంగానే...
ఓవల్ జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ మాత్రం ఉత్కంఠ భరితంగానే సాగింది. టీం ఇండియా ఇంగ్లండ్ మీద ఐదో టెస్ట్ మ్యాచ్ లో కేవలం ఆరు పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. 374 పరుగుల లక్ష్య సాధనలో నిన్న 339 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్ 367 పరుగులకు ఆల్ అవుట్ అయింది. జెమీ స్మిత్ రెండు పరుగులు, జెమీ ఒవర్టన్ తొమ్మిది పరుగులు, జోష్ టంగ్ డకౌట్ అయి వెనుదిరిగారు. చివరిగా అట్కిన్సన్ పదిహేడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
తక్కువ పరుగుల లక్ష్యమే అయినా...
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224 పరుగులు, ఇంగ్లండ్ 247 పరుగులు చేశాయి. భారత్ కంటే తొలి ఇన్నింగ్స్ లో కేవలం 23 పరుగుల ఆధిక్యతతోనే ఇంగ్లండ్ ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా టీం ఇండియా 3986 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 367 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. చివర వరకూ మ్యాచ్ లో విజయం ఇంగ్లండ్ వైపు తొంగిచూసింది. కానీ ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలం అయ్యారు. మహ్మద్ సిరాజ్ ఐదు, ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీసి భారత్ కు అద్భుతమైన విజయాన్ని అందించారు. దీంతో సిరీస్ సమం అయింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు సరైన సమయంలో తీసిన హైదరాబాదీ ఆటగాడు సిరాజ్ పై దేశ వ్యాప్తంగాప ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.


Tags:    

Similar News