భారత్ -పాక్ మ్యాచ్ ఎలా చూడగలను
ప్రపంచ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీనుంచి భారత జట్టు అధికారికంగా వైదొలిగింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీనుంచి భారత జట్టు అధికారికంగా వైదొలిగింది. టోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా జులై 31న భారత్, పాకిస్థాన్ మధ్య సెమీ ఫైనల్ జరగాల్సి ఉంది. ఇరుదేశాల మధ్య ఉద్రికత్తలు నెలకొనడంతో పాక్ జట్టుతో ఆడటానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. దీంతో పాకిస్థాన్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో లీగ్ దశలో కూడా పాకిస్థాన్‌తో భారత్ ఆడకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరుజట్లకూ చెరో పాయింట్ ఇచ్చారు. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు.. వెస్టిండీస్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గి పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్ దక్కించుకుని సెమీస్‌కు చేరింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మరో సెమీ ఫైనల్ జరగనుంది. ఆగస్టు 2న ఫైనల్ జరగనుంది.