34 ఏళ్ల త‌ర్వాత ఘోర ప‌రాభ‌వం.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన కెప్టెన్‌..!

వెస్టిండీస్‌తో జరిగిన చివ‌రి, మూడో వ‌న్డేలో ఓటమికి గల కారణాన్ని పాకిస్థాన్ క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వివరించాడు.

Update: 2025-08-13 04:29 GMT

వెస్టిండీస్‌తో జరిగిన చివ‌రి, మూడో వ‌న్డేలో ఓటమికి గల కారణాన్ని పాకిస్థాన్ క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వివరించాడు. మూడో వన్డేలో వెస్టిండీస్ 202 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. దీంతో మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు 34 ఏళ్ల త‌ర్వాత విండీస్‌పై సిరీస్ ఓడింది. 34 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అజేయ సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 294 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు 29.2 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది.

వెస్టిండీస్‌తో ODI సిరీస్ ఓడిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ఈ పిచ్‌పై నాలుగు ఇన్నింగ్స్‌ల టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ఇది మూడో మ్యాచ్‌లా భావించాం. చివరి 10 ఓవర్లలో విండీస్ ఇన్నింగ్సు నిర్మించిన ఊపు.. మా అంచనాలను తారుమారు చేసింది

మొదటి 40 ఓవర్ల మ్యాచ్ మా కంట్రోల్‌లో ఉంది. 220 పరుగుల లక్ష్యం మా ఎదుట‌ ఉంటుంద‌ని భావించాం. దీని క్రెడిట్ షాయ్ హోప్ కే దక్కుతుంది. అతని ప్లాన్ బాగా ఉంది.. అంతా అతనికి అనుకూలంగా జరిగింది. హోప్ బాగా బ్యాటింగ్ చేశాడు. కొన్ని మంచి షాట్లు ఆడాడు. అయూబ్, సల్మాన్ బౌలింగ్ చేస్తున్నారు. అబ్రార్ త‌న కోటా బౌలింగ్ చేస్తాడ‌ని మేము అనుకున్నాము.. కానీ హోప్ బాగా బ్యాటింగ్ చేసాడు.. అందువల్ల అతడు తన కోటా ఓవర్ పూర్తి చేయలేకపోయాడు. సీల్స్ బాగా బౌలింగ్ చేస్తూ సిరీస్ అంతటా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. మాకు భాగస్వామ్యాలు అవసరం.. క్రీజులో కొంత సమయం గడపవలసి ఉంది.. కానీ అది జరగలేదని కార‌ణాన్ని వెల్ల‌డించాడు.

అంతకుముందు, రిజ్వాన్ రెండో వన్డేలో ఓటమి తర్వాత కూడా జట్టు గురించి అదే ప్రకటన ఇచ్చాడు.. అతడు ఐదవ బౌలింగ్ ఎంపికను త‌ప్పుబ‌ట్టాడు.


Tags:    

Similar News