అతి చేసిన హారిస్ రవూఫ్.. ఐసీసీ నిషేధం
ఆసియా కప్ సందర్భంగా భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది.
ఆసియా కప్ సందర్భంగా భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్‌పై రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం విధించింది. భారత్ తరపున సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు కూడా జరిమానాలు, డీమెరిట్ పాయింట్లను ఎదుర్కొన్నారు. హారిస్ రవూఫ్ రెండు వేర్వేరు సంఘటనల్లో ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించినందుకు గాను అతనికి ప్రతి సంఘటనకు రెండు చొప్పున మొత్తం నాలుగు డీమెరిట్ పాయింట్లు లభించాయి. 24 నెలల కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్లు రావడంతో రవూఫ్‌పై రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిషేధం విధించారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం దోషిగా తేలారు. ఫలితంగా అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా, రెండు డీమెరిట్ పాయింట్లు విధించారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన తప్పిదాన్ని అంగీకరించడంతో, అధికారిక హెచ్చరిక ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టుకున్నాడు.