Hardik Pandya : ఆ షాకింగ్ డెసిషన్ నిజమేనా..? అదే నిజమయితే ఈసారి కప్పు గ్యారంటీనా?

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ కు వెళతారంటున్నారు

Update: 2023-11-25 06:43 GMT

ఇటీవలే వన్డే వరల్డ్ కప్ పూర్తయింది. ఇక ఆస్ట్రేలియాతో మరో నాలుగు టీ 20 మ్యాచ్ లను టీం ఇండియా ఆడాల్సి ఉంది. అయితే ఒక షాకింగ్ న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్ లో కంగారు పెట్టిస్తుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఆజట్టును వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2024లో ఐపీఎల్ వేలానికి డిసెంబరు 19వ తేదీ నుంచి జరగనుంది. మ్యాచ్ ల ప్రారంభ తేదీపై స్పష్టం రాకపోయినప్పటికీ ఆక్షన్ విష‍యంలో మాత్రం క్లారిటీ వచ్చింది. ప్లేయర్లను తమ సొంతం చేసుకునేందుకు అన్ని జట్లు ప్రయత్నిస్తాయి.

ముంబయి ఇండియన్స్ కు...
అయితే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ కు వెళతారంటున్నారు. వేలానికి ముందు ఫ్రాంచైజీలు నేరుగా స్వాప్ ద్వారా ఆటగాళ్లను మార్చుకునే వీలుంది. దీంతో ముంబయి ఇండియన్స్ హార్ధిక్ పాండ్యాను తిరిగి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని. గుజరాత్ టైటాన్స్ కు ఒకసారి కప్పు అందించిన హార్థిక్ పాండ్యా ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం గుజరాత్ టైటాన్స్ కు షాక్ అనే చెప్పాలి. ఆల్ రౌండర్ గా పేరొందిన హార్ధిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ ఎందుకు వదులుకుంటుంది. పాండ్యా ఆ జట్టును వీడి ఎందుకు వెళుతున్నారన్న చర్చ జోరుగా సాగుంది.
పదిహేను కోట్లకు...
హార్థిక్ పాండ్యాను పదిహేను కోట్లకు తిరిగి తెచ్చుకోవాలని యోచిస్తున్నట్లు వస్తున్న న్యూస్ మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. హార్థిక్ పాండ్యా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగలడు. అదే సమయంలో భారీ స్కోరును చేయగలడు. ఛేజింగ్ లోనూ జట్టును విజయం వైపు నడిపించగలడు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లోనూ హార్ధిక్ పాండ్యా లేకపోవడం వల్లనే ఫైనల్స్ లో భారత్ ఓటమి పాలయిందన్న కామెంట్స్ బలంగా వినిపించాయి. జనవరికి గాని పాండ్యా గాయం నుంచి కోలుకోలేరని అంటున్నారు. అయితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా? నిజంగా హార్థిక్ అన్నంత పని చేస్తారా? అన్నది ఐపీఎల్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
పటిష్టమైన స్క్వాడ్...
ముంబయి ఇండియన్స్ అన్ని జట్ల కంటే అత్యధికంగా కప్ ను గెలుచుకుంది. ఐదుసార్లు గెలుచుకుని తన సత్తా చాటింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పటిష్టమైన స్క్వాడ్ ఉన్న ముంబయి ఇండియన్స్ లోకి హార్ధిక్ పాండ్యా కూడా వచ్చి చేరితే 2024 లోనూ కప్పు గ్యారంటీ అన్న టాక్ వినపడుతుంది. రోహిత్ శర్మ (కెప్టెన్), డేవాల్డ్ బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రమణ్‌దీప్ సింగ్, టిమ్ డేవిడ్, స్టబ్స్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కేమరెన్ గ్రీన్, నేహాల్ వధేరా, జాన్ సేన్ లు ఉన్నారు. కెప్టెన్సీని వదులు కుని కేవలం డబ్బుల కోసం హార్ధిక్ పాండ్యా జట్టు మారతాడా? అన్నది కూడా అనుమానం అందరిలోనూ ఉంది.
Tags:    

Similar News