దినేష్ కార్తీక్ తో అలా ప్రవర్తించి.. హార్దిక్ పాండ్యాపై విమర్శలు

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి T20Iలో భారత స్టార్లు హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ గురువారం నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి పునరాగమనం చేశారు.

Update: 2022-06-10 05:31 GMT

హార్దిక్ పాండ్యా చాలా రోజుల తర్వాత భారతజట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే..! దక్షిణాఫ్రికా సిరీస్ లో హార్దిక్ పాండ్యా రాణించాలని.. భారత జట్టులో ఆల్ రౌండర్ లేని లోటు పూడ్చాలని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి T20Iలో భారత స్టార్లు హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ గురువారం నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి పునరాగమనం చేశారు. గత సంవత్సరం T20 ప్రపంచ కప్ తర్వాత పాండ్యా మొదటిసారిగా ఇండియా జట్టు లోకి తిరిగి రాగా, కార్తీక్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జట్టులోకి వచ్చాడు.

మొదటి T20I మ్యాచ్ లో భారత్ 20 ఓవర్లలో 211/4 బలమైన స్కోరును నమోదు చేసింది. ఆట చివరి ఓవర్లో అన్రిచ్ నార్ట్జే బౌలింగ్‌లో కార్తీక్ పాండ్యాతో కలసి క్రీజులో ఉన్నాడు. అతని మొదటి బంతికి భారీ షాక్ కు ప్రయత్నించగా అది డాట్ బాల్ అయింది, కార్తీక్ తర్వాతి యార్కర్-లెంగ్త్ బంతికి సింగిల్ సాధించగలిగాడు, పాండ్యాను స్ట్రైక్‌కి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఓవర్‌లో నాలుగో బంతికి హార్దిక్ సిక్సర్‌ బాదాడు. ఐదవ బంతికి, హార్దిక్ డీప్ మిడ్‌వికెట్ వైపు ఫ్లిక్ చేసాడు, అయితే ఆశ్చర్యకరంగా ఒక పరుగును తిరస్కరించాడు, స్ట్రైక్‌ను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు IPL 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం ఆఖరి ఓవర్లలో దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడగా.. ఈ మ్యాచ్ లో ఆఖరి బంతికి దినేష్ కార్తీక్ కు స్ట్రైక్ ఎందుకు ఇవ్వలేదో అనే విమర్శలు వస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 211 ప‌రుగులు చేసింది. భార‌త ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ ఏకంగా 76 ప‌రుగులు చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ 23 ప‌రుగుల‌తో ఫ‌ర‌వాలేద‌నిపించాడు. శ్రేయాస్ అయ్య‌ర్ (36), ఆ త‌ర్వాత వ‌చ్చిన కెప్టెన్ రిష‌బ్ పంత్ (29), హార్దిక్ పాండ్యా (31) రాణించారు. దక్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో కేశ‌వ్ మ‌హారాజ్‌, డేనియ‌ల్ ప్రిటోరియ‌స్‌, ఎన్రిచ్ నోర్ట‌జే, వైనీ పార్నెల్‌ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది. భారత జట్టు నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది దక్షిణాఫ్రికా. డుసెన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 75 పరుగులు చేయగా, మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. ప్రిటోరియస్ 13 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. క్వింటన్ డి కాక్ 22, కెప్టెన్ తెంబా బవుమా 10 పరుగులు చేశారు. మిల్లర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.


Tags:    

Similar News