IPL 2025 : రేపటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం

క్రికట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రేపటి నుంచి ఐపీఎల్ 2025 మ్యాచ్ లు పున:ప్రారంభం కానున్నాయి.

Update: 2025-05-16 04:02 GMT

IPL matches

క్రికట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రేపటి నుంచి ఐపీఎల్ 2025 మ్యాచ్ లు పున:ప్రారంభం కానున్నాయి. జులై మూడో తేదీన ఫైనల్స్ జరగనున్నాయి. పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో మ్యాచ్ లను నిలిపేశారు. ఇటీవల రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి ఐపీఎల్ సీజన్ 18 ని ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఆగిపోయిన పదిహేడు మ్యాచ్ లు..
ఆగిపోయిన పదిహేడు మ్యాచ్ లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో కోల్ కత్తానైట్ రైడర్స్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మే 7న ఐపీఎల్ మ్యాచ్ లను రద్దు చేసిన బీసీసీఐ తిరిగి రేపటి నుంచి ప్రారంభం కానుంది.


Tags:    

Similar News