Fourth Test : నేటి నుంచి ఇండియా - ఇంగ్లండ్ నాలుగో టెస్ట్

భారత్ - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ నేడు జరగనుంది. మాంచెస్టర్ వేదికగా నేడు జరగనున్న మ్యాచ్ భారత్ కు కీలకం

Update: 2025-07-23 01:57 GMT

భారత్ - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ నేడు జరగనుంది. మాంచెస్టర్ వేదికగా నేడు జరగనున్న మ్యాచ్ భారత్ కు కీలకం. ఇప్పటికే ఇంగ్లండ్ 2 -1 తేడాతో స్కోరులో ఆధిక్యతతో ఉంది. దీంతో భారత్ కు మాంచెస్టర్ లో జరుగుతున్న మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాలి. అప్పుడే స్కోర్లు సమం అవుతాయి. అయిదో టెస్ట్ లో సిరీస్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.

గాయాలతో...
అయితే భారత జట్టులో ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. చివరి టెస్ట్ నామమాత్రంగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ జట్టు ఏ రకమైన ప్రదర్శన చేస్తుందన్నది చూడాలి. స్వల్ప మార్పులతో భారత్ జట్టు బరిలోకి దిగే అవకాశముంది. ఇంగ్లండ్ మాత్రం ఆడుతూ పాడుతూ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది.


Tags:    

Similar News