India Vs England Fourth Test : నాలుగో టెస్ట్ లో భారత్ జట్టు కూర్పు కష్టమేనా?

ఇండియా - ఇంగ్లండ్ ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ కు మరి కొద్ది గంటల సమయమే ఉంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారత్ కు కీలకం

Update: 2025-07-22 02:48 GMT

ఇండియా - ఇంగ్లండ్ ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ కు మరి కొద్ది గంటల సమయమే ఉంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారత్ కు కీలకం. అందుకే తుది జట్టు ప్రకటనపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అన్నీ ఊహాగానాలే వినిపిస్తున్నాయి. తీసివేతలు, కూర్పులపై గత కొద్దిరోజులుగా జరుగుతున్నవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. మూడోటెస్ట్ లో ఇండియా ఇంగ్లండ్ పై తక్కువ పరుగులతో ఓటమి పాలు కావడంతోనే ఈరకమైన ప్రచారం ఎక్కువయింది. దీనికి తోడు టీం ఇండియా జట్టులో ఉన్న సభ్యులకు గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి గాయాలపాలయ్యారు. నితీష్ కుమార్ రెడ్డిని తప్పించడం ఖాయంగా కనిపిస్తుంది.

పంత్ ఆడటం గ్యారంటీ...
రిషబ్ పంత్ మాత్రం ఆడగలిగే స్థితిలో ఉండటంతో నాలుగో మ్యాచ్ లో ఆడించాలన్న నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు చెబుతున్నారు. రిషబ్ పంత్ వికెట్ కీపర్ గానే కాకుండా మంచి స్కోరు చేయడంలోనూ, బ్యాటర్ గా నిలదొక్కుకోవడంలో గత మూడు మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేయడంతో రిషబ్ పంత్ ను అత్యంత కీలకమైన మ్యాచ్ లో ఆడించాల్సిందేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అలాగే బీసీసీఐ కూడా అదే ఆలోచనలో ఉంది. రిషబ్ పంత్ కు అయిన గాయం అంత తీవ్రం కాకపోవడంతో పంత్ మాంచెస్టర్ లో ఆడతాడని చెబుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి మాత్రం కోలుకోలేని గాయం కావడంతో తర్వాత రెండు టెస్ట్ లకు దూరమయ్యే అవకాశముంది.
బ్యాటర్లతో పాటు బౌలర్లు...
ఇక ప్రధానంగా మాంచెస్టర్ మ్యాచ్ లో బ్యాటర్లు నిలదొక్కుకునే వారు అవసరం. శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్ నిలబడితే చాలు మంచి స్కోరు సాధించవచ్చు. అలాగే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లు కూడా కాస్త నిలబడితే చాటు నెమ్మదిగా ఆడినా స్కోరును ముందుకు తీసుకెళ్లగలరు. ఇక కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ ను తీసుకోవాలన్న డిమాండ్ వినపడుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావించినప్పటికీ నాలుగో టెస్ట్ లో ఆడించాలని బీసీసీఐ భావిస్తుంది. అలాగే సిరాజ్ కు కూడా విశ్రాంతి ఇవ్వాలనుకున్నా అది కుదిరేటట్లు కనిపించడం లేదు. కులదీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకుంటే ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయగలడన్ననమ్మకాన్నిచాలా మందివ్యక్తం చేస్తున్నారు. మరి తుది జట్టులో ఎవరుంటారన్నది నేడు తెలియనుంది. మొత్తం మీద నలుగురిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది.


Tags:    

Similar News