India vs England Fourh Test : ఆల్ రౌండర్లు.. అంటుకుపోయి... మ్యాచ్ ను డ్రా చేశారు

ఇండియా - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది

Update: 2025-07-28 02:19 GMT

ఇండియా - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. మూడు సెంచరీలతో భారత్ బ్యాటర్లు మంచి పోరాటమే చేశారు. సిరీస్ ను సమం చేసుకునేందుకు ఇంకా ఆశలు నిలపగలిగారు. గట్టిగా పోరాడుతున్నప్పటికీ కీలకమైన రెండు వికెట్లను ఆఖరిరోజు లంచ్ బ్రేక్ కు ముందు కోల్పోవడంతో కొంత ఆందోళన కలిగింది. రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ఐదో రోజు ఆటను ప్రారంభించి పరవాలేదనిపించింది. కేఎల్ రాహుల్ 90 పరుగుల వద్ద అవుట్ కావడం నిజంగా దురదృష్టకరమే. ఎందుకంటే కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాడు నిలకడగా ఆడుతూ సెంచరీ చేసినా, ఇంకా కొద్దిసేపు ఉన్నా భారత్ కు మరికొన్ని పరుగులు లభించేవి.

గిల్ సెంచరీ చేసి...
అదే సమయంలో కెప్టెన్ శుభమన్ గిల్ కూడా 103 పరుగులు చేసి అవుట్ కావడంతో భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి 223 పరుగులు మాత్రమే చేసింది. ఇద్దరూ అవుట్ కావడంతో ఒకింత ఆందోళన భారత్ అభిమానుల్లో కలిగింది. లంచ్ బ్రేక్ ముందు ఇద్దరు అవుట్ కావడంతో రోజంతా భారత్ ఆటగాళ్లు నిలబడి ఆడాల్సి ఉంటుంది. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఉన్నారు. అలాగే ఈ మ్యాచ్ లోనూ రిషబ్ పంత్ ఆడే అవకాశాలుండటంతో ఒకింత డ్రాగా ముగుస్తుందన్న ఆశలు మాత్రం ఇంకా భారత్ అభిమానుల్లోఉన్నాయి. ఆల్ అవుట్ కాకుండా ఉండటం భారత్ బ్యాటర్లకు ఇప్పుడు పెద్ద సవాల్ అని భావించిన వారు కూడా లేకపోలేదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
ఇద్దరూ నిలబడి...
అయితే ఆల్ రౌండర్లు ఇద్దరు భారత్ పరువును నాలుగో మ్యాచ్ లో నిలబెట్టారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు చివరి వరకూ నిల్చుని టెస్ట్ ను డ్రాగా ముగించారు. అద్భుతంగా ఆడారు. ఇద్దరూ నిలబడి భారత్ పరువు నిలిపారు. రవీంద్ర జడేజా 107 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, వాహిసంగ్టన్ సుందర్ 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలబడి నాలుగో టెస్ట్ ను డ్రా గా ముగించారు. రోజంతా ఇద్దరూ ఆటలో నిలవడంతో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 425 పరుగులు చేయగలిగింది. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు చేసిన కృషి ఫలించలేదు. వీరిద్దరూ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ తో భారత్ మరో ఓటమిని తప్పించుకున్నట్లయింది. ఐదో టెస్ట్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేసుకునేందుకు ఆశలు సజీవంగా నిలుపుకుంది.


Tags:    

Similar News