India Vs Australia T20 : నిర్ణయాత్మకమైన మ్యాచ్.. ఈ మ్యాచ్ లో గెలవాలని

భారత్ - ఆస్ట్రేలియా మధ్య రేపు నాలుగో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాయపూర్ వేదికగా జరగనుంది

Update: 2023-11-30 04:26 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య రేపు నాలుగో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాయపూర్ వేదికగా జరగనుంది. నాలుగో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భారత్, ఈ మ్యాచ్ లో విజయం సాధించి సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తుంది. అందుకే ఇరు జట్లు ఇప్పటికే రాయపూర్ చేరుకుని ప్రాక్టీస్ ను ప్రారంభించాయి. టీ 20 మ్యాచ్‌లలోనూ రెండు వందలకు పైగా పరుగులు చేయడం సాధారణంగా మారిపోయింది. సెంచరీలు కూడా నమోదవుతుండటంతో బ్యాటర్లతో పాటు బౌలర్లు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.

కొన్ని మార్పులతో...
అయితే టీం ఇండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న భారత్ కీలక మార్పులను చేయనున్నట్లు తెలిసింది. శ్రేయస్ అయ్యర్ ను రంగంలోకి దించనుంది. మరి అయ్యర్ వస్తే ఎవరిని తొలగిస్తారన్నది ఇంకా తేలలేదు. ఒక బ్యాటర్ పై మాత్రం వేటు పడనుంది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్ లేదా దీపక్ చాహర్ ను తీసుకోవాలని కూడా నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు మరికొందరికి అవకాశమివ్వాలని యోచనలో ఉంది.
స్వదేశానికి వెళ్లడంతో...
ఇక ఆస్ట్రేలియా కూడా ఒక మ్యాచ్ గెలిచి ఉత్సాహంతో ఉంది. ఈ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారడంతో ఇరు జట్లు తమ బలాబలాలను సరి చూసుకుని మరి జట్టులో కూర్పును చేసుకుంటున్నారు. అయితే ఆసీస్ నుంచి మ్యాక్స్‌వెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. చివరి రెండు టీ20లకు మేనేజ్‌‌మెంట్ విశ్రాంతి ఇవ్వడంతో నాలుగో టీ20కి అందుబాటులో ఉండరు. స్టాయినిస్ కూడా ఆస్ట్రేలియా పయనమయి వెళ్లిపోయాడు. ఎక్కువ మంది వరల్డ్ కప్, టీ 20 లు ఆడి అలసి పోవడంతో వారిని స్వదేశానికి పంపడంతో మిగిలిన వారితోనే నాలుగు, ఐదు టీ20లలో ఆస్ట్రేలియా భారత్ తో తలపడనుంది.



Tags:    

Similar News