India vs Australia : నేడు భారత్ - ఆస్ట్రేలియా నాలుగో టీ20
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు నాలుగో టీ20 జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు నాలుగో టీ20 జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ లో భారత్ - ఆస్ట్రేలియాలు 1 -1 తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ కు ఈ సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. మరొక మ్యాచ్ మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ గెలుపు రెండు జట్లకు అత్యవసరంగా కనిపిస్తుంది.
ఇరు జట్లకు...
ఆస్ట్రేలియాకు కూడా సొంత గడ్డమీద సిరీస్ చేజారకుండా జాగ్రత్తపడాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. అందుకే రెండు జట్లు గత రెండు రోజులుగా జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. భారత్ మూడో టీ20లలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఆస్ట్రేలియా జట్టులో స్వల్పమార్పులు ఉండనున్నాయి. హెడ్ ఈ మ్యాచ్ కు దూరం కానున్నారు. మరి ఈ మ్యాచ్ ఎవరి సొంతమవుతుందన్నది చూడాలి.