షేక్ హ్యాండ్ వివాదంపై గంగూలీ ఏమన్నారంటే?

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న హ్యాండ్‌షేక్ వివాదంపై స్పందించారు

Update: 2025-09-16 08:13 GMT

భారత మాజీకెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న హ్యాండ్‌షేక్ వివాదంపై స్పందించారు. “జట్టు తాము సరిగ్గా అనుకున్నదే చేసింది” అని గంగూలీ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన మ్యాచ్ అనంతరం, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, షివం దూబే మైదానం విడిచిపోతూ పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపలేదు.

ఆసియాకప్ లో...
దీనిపై పాకిస్తాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీపై చర్యలుతీసుకోవాలని కోరింది. ఐసీపీమాత్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయంతీసుకోక పోయినాభారత్ కు చెందిన మాజీ ఆటగాళ్లు మాత్రం దీనిపై స్పందిస్తున్నారు. మ్యాచ్ గెలిచిన తరువాత, సూర్యకుమార్ ఈ విజయాన్ని భారత సాయుధ దళాలకు అంకితం చేసి, పహల్గామ్ బాధితుల పట్ల ఐక్యత ప్రకటించడాన్నిగంగూలీ సమర్ధించారు.


Tags:    

Similar News