Ambati Rayudu : రాయుడూ.. ఏందిసామీ ఈ ట్వీట్లు

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎప్పుడూ వివాదంలోనే చిక్కుకుంటారు. తాజా ట్వీట్ తో కొందరు రాయుడిని ట్రోల్ చేస్తున్నారు

Update: 2025-05-09 03:18 GMT

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎప్పుడూ వివాదంలోనే చిక్కుకుంటారు. భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్న సమయంలో అంబటి రాయుడు చేసిన ట్వీట్ పై రచ్చ మొదలయింది. "పాయింట్ల పట్టిక ఇండియా మ్యాప్‌లా ఉందే" అంబటి రాయుడు"పాయింట్ల పట్టిక ఇండియా మ్యాప్‌లా ఉందే" అంటూ అంబటి రాయుడు ట్వటీ్ చేశారు.

కంటికి కన్ను అంటూ...
 'కంటికి కన్ను అంటే ప్రపంచమే గుడ్డిదవుతుంది'అనే మహాత్మ గాంధీ కొటేషన్‌ను రాయుడు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాయుడు చేసిన ఈ ట్వీట్ ను కొందరు తప్పుపడుతున్నారు. కొందరు మాత్రం అంబటి రాయుడి ట్వీట్‌ను సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం అభ్యంతరం తెలుపుతున్నారు. పాక్ కు మద్దతుగా ఈ ట్వీట్ ఉందని ఆరోపిస్తూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. పాక్ - భారత్ ల మధ్య ఉద్రిక్తతలతో టెన్షన్ గా ఉంటే ఈ ట్వీట్ లు ఏంటి రాయుడూ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News