India vs South Africa : ఇరుజట్ల మధ్య దోబూచులాడుతున్న విజయం

భారత్- దక్షిణాఫ్రికా మధ్య కోల్ కత్తాలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది.

Update: 2025-11-15 11:57 GMT

భారత్- దక్షిణాఫ్రికా మధ్య కోల్ కత్తాలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. అందినట్టే అందుతుంది. మరి చివరకు ఏమవతుంది? అన్నది తేలకుండా ఉంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికా జట్లు మాత్రం బ్యాటింగ్ పరంగా విఫలమవతున్నాయి. అదే సమయంలో భారత బౌలర్లు మాత్రం మంచి దూకుడు మీదున్నారు. వికెట్లు వెంటవెంటనే తీసుకుంటుండటంతో మ్యాచ్ ఎవరి వైపు టర్న్ తీసుకుంటుందన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి...
రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 93 పరుగులు చేసి ఏడు వికెట్లను కోల్పోయింది. భారత్ స్పిన్నర్లు అదరగొట్టేశారు. వరసగా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ప్రస్తుతం భారత్ కంటే దక్షిణాఫ్రికా కేవలం 93 పరుగుల ఆధిక్యతతోనే ఉంది. కోర్బిన్ బాష్ ఒక పరుగుతోనూ, కెప్టెన్ తెంబా బావుమా 29 పరుగులుతోనూ క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆటను 37 పరుగులతో ప్రారంభించిన భారత్ కేఎల్ రాహుల్ 39, వాషింగ్టన్ సుందర్ 29, రిషబ్ పంత్ 27, రవీంద్ర జడేజా 27 పరుగులు చేయగలిగారు.
బౌలర్లే కీలకమై...
శుభమన్ గిల్ కు మెడ పట్టేయడంతో ఈరోజు బ్యాటింగ్ రాలేదు. దీంతో దక్షిణాఫ్రికాపై కేవలం ముప్ఫయి పరుగుల ఆధిక్యతను మాత్రమే భారత్ సాధించగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హర్మర్ నాలుగు, మార్కో యాన్సెన్ మూడు వికెట్లు తీశారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, కులదీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. రేపు మిగిలిన మూడు వికెట్లను భారత్ వెంట వెంటనే తీసి తర్వాత బ్యాటర్లు నిలదొక్కుకుంటే భారత్ కు విజయం సాధ్యమవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం విజయం రెండు జట్లకు మధ్య దోబూచులాడుతుంది.
Tags:    

Similar News