India vs South Africa : భారత్ - దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్ నేడు
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలిటెస్ట్ నేడు ప్రారంభం కానుంది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలిటెస్ట్ నేడు ప్రారంభం కానుంది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఎటు చూసుకున్నా ఈ మ్యాచ్ లో భారత్ కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా జట్టు భారత్ గడ్డపై సిరీస్ గెలిచిన సంఘటనలు అరుదు. దాదాపు పదిహేనేళ్ల క్రితం గెలిచింది. అప్పటి వరకూ దక్షిణాఫ్రికా గెలుపు కోసం ఎదురు చూస్తుంది. అదే సమయంలో ఎనిమిది సార్లు భారత్ లో దక్షిణాఫ్రికా ఆడితే అందులో కేవలం ఒకే ఒకసారి ఆ జట్టు విజయాన్ని రుచి చూసింది. ఈ గణాంకాలు చాలు భారత్ కు గెలుపు అవకాశాలున్నాయని చెప్పడానికి.
గణాంకాలు చూసినా...
అదే సమయంలో భారత్ జట్టు పటిష్టంగా ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆదేశంతో సిరీస్ కోల్పోవచ్చు కాని, ఒక మ్యాచ్ గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. భారత్ బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. అందులోనూ సొంత మైదానం. ఇక తిరుగులేదన్నది భారత్ అభిమానుల అభిప్రాయం. అదే సమయంలో భారత్ ఈ సిరీస్ ను గెలిచి ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకునే అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి వీలుంది. అందుకే భారత్ జట్టుకు ఈ సిరీస్ ను గెలుచుకోవాలన్న కసి ఎక్కువగా కనపడుతుంది. కానీ దక్షిణాఫ్రికాను కూడా అంత తేలిగ్గా అంచనాలు వేయడం సరికాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.
స్వల్ప మార్పులతో...
భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగినప్పటికీ ఓపెనర్ల నుంచి ఆల్ రౌండర్ల వరకూ ఉండటంతో టీం ఇండియా పటిష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో గణాంకాలు కూడా భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ సిరీస్ ను నెగ్గి సొంత గడ్డపై నిలిచి ప్రపంచ ఛాంపియన్ షిప్ నకు దగ్గరవ్వాలని టీం ఇండియా ఉవ్విళ్లూరుతుంది. రిషబ్ పంత్ కూడా రావడంతో అదనపు బలం సమకూరినట్లయింది. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా పంత్ వేగంగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో దిట్ట. అయితే పంత్ జట్టులోకి రావడంతో నితీష్ కుమార్ రెడ్డిపై వేటు పడే అవకాశాలున్నాయి. భారత్ జట్టుపై ఉన్న అనేక అంచనాలు ఈ మ్యాచ్ ద్వారా నెరవేరతాయని అభిమానులు భావిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.