Inda vs Australia T20 : బెదురు వద్దు... బెంగ వద్దు.. వచ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకోవద్దు

నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. విశాఖలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి ఏడుగంటలకు ప్రారంభం కానుంది.

Update: 2023-11-23 04:16 GMT

నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. విశాఖలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి ఏడుగంటలకు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా భారత్ లో మొత్తం ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే విశాఖకు చేరుకున్న ఇరు జట్లు నిన్న ప్రాక్టీస్ ప్రారంభించాయి. టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. దాదాపు రెండు వేల మందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అంతా జూనియర్లతోనే....
సీనియర్లు లేకుండానే తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇటీవల వరసగా వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడిన సీనియర్లకు విశ్రాంతి నిచ్చి యువకులకు అవకాశమిచ్చారు. యువకులకు ఇది సరైన అవకాశం. తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి లభించే అరుదైన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న వారే టీం ఇండియాలో చోటు సంపాదించుకుంటారు. వత్తిడి ఏమీ లేకున్నా సొంత మైదానం కావడంతో ఆచి తూచి ఆడాల్సి ఉంటుంది. అప్పుడే బ్యాటర్లు కానీ, బౌలర్లు కానీ తమ ఆటను ప్రదర్శించే వీలుంటుంది.
జట్టు ఇదే....
భారత్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ వైఎస్ కెప్టెన్ గా ఉంటారు. ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ ( వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్హదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, ఆవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్ లు జట్టులో ఉన్నారు. మొన్నటి వరకూ వన్డే మ్యాచ్ లు ఆడిన జట్టును మన కుర్రోళ్లు ఓడించాలని తహతహలాడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ లో గెలిచిన ఆనందంతో ఆస్ట్రేలియా మరింత ఉత్సాహంతో మైదానంలోకి అడుగుపెడుతుంది.



Tags:    

Similar News