India vs England Fifth Test : వావ్.. మన బౌలర్ల వీర విహారం.. దెబ్బకు ఇంగ్లండ్ కుప్పకూలిందిగా?

ఇండియా - ఇంగ్లండ్ మధ్య ఓవల్ లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది

Update: 2025-08-02 01:11 GMT

ఇండియా - ఇంగ్లండ్ మధ్య ఓవల్ లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. భారత్ 224 పరుగులు చేసి ఆల్ అవుట్ అవ్వడంతో ఇక ఈ మ్యాచ్ పై ఆశలు సన్నగిల్లాయి. అయితే లంచ్ బ్రేక్ తర్వాత మాత్రం భారత బౌలర్లు పుంజుకుకన్నారు. మ్యాచ్ ఇంగ్లండ్ పరం కాకుండా వెంటవెంటనే వికెట్లు తీయగలిగారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత బ్యాటర్లు జోరు పెంచడంతో ఈ అనుమానం మరింత పెరిగింది. అయితే ప్రసిద్ధ కృష్ణ నాలుగు, మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 247 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అంటే రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో భారత్ కంటే ఇంగ్లండ్ కేవలం 23 పరుగుల స్వల్ప ఆధిక్యతతో మాత్రమే సరిపెట్టుకుంది.

బ్యాటింగ్ కు దిగిన...
తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత్ బౌలర్లను ఉతికి ఆరేశారు. లంచ్ బ్రేక్ సమయానికి పదహారు ఓవర్లలోనే ఇంగ్లండ్ కేవవలం ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసిందంటే ఏ రేంజ్ లో భారత్ బౌలర్లను ఆడుకుంటున్నారో అర్థమవుతుంది. బెన్ డకెట్ 43 పరుగులు చేసి అవుట్ కాగా, జాక్ క్రాలే మాత్రం అర్థ సెంచరీ చేశాడు. ఓలీ పోల్ మాత్రం పరుగులతో కొనసాగుతున్నాడు. బెన్ డకెట్ ఆకాశ్ దీప్ వేసిన బౌలింగ్ లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కు చిక్కి వెనుదిరిగాడు. అయితే ఇంగ్లండ్ మాత్రం దూకుడగా ఆడుతుంది. ఎలాగైనా మ్యాచ్ ను గెలిచి తీరాలన్న కసితో ఇంగ్లండ్ బ్యాటర్లు విజృంభిస్తున్నారు. భారత్ బౌలర్లు వికెట్ తీయడం కోసం శ్రమిస్తున్నారు. చివరకు బౌలర్లు పై చేయిసాధించారు.
అంతకుముందు...
ఇండియా - ఇంగ్లండ్ మధ్య ఓవల్ లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. ఇప్పటికే సిరీస్ పై ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ బౌలర్ల చేతితో చిత్తుగా అవుటయి వెనుదిరిగారు. అతి తక్కువ పరుగులు చేసి భారత్ ఆల్ అవుట్ అయింది. తొలిరోజు 204 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ రెండో రోజ ఇరవై పరుగులు మాత్రమే చేసి మిగిలిన నాలుగు వికెట్లను చేజార్చుకుంది. దీంతో భారత్ ఈ టెస్ట్ లో 224 పరుగులకే ఆల్ అవుట్ అయి ఇంగ్లండ్ విజయానికి ఊతమిచ్చినట్లయింది. యశస్వి జైశ్వాల్ రెండు, కేఎల్ రాహుల్ 14, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, సాయిసుదర్శన్ 38, గిల్ 21, వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు మాత్రమే చేశారు. అయితే ఇంగ్లండ్ ను కూడా తక్కువ పరుగులకే మట్టి కరిపించడంతో మ్యాచ్ లో ఆశలు సజీవంగా నిలిపారు.


Tags:    

Similar News