India Vs England Fifth Test : ఐదో టెస్ట్ లో మనోళ్లు ఏం చేస్తారో? విజయం అవసరమైన మ్యాచ్ మరి
ఇండియా - ఇంగ్లండ్ ల మధ్య చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ కీలకం కానుంది
ఇండియా - ఇంగ్లండ్ ల మధ్య చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ కు విజయం అవసరం. ఎందుకంటే ఇప్పటికే నాలుగు టెస్ట్ లు జరిగాయి. ఇందులో రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఇంగ్లండ్ గెలవగా, ఒక మ్యాచ్ లో భారత్ గెలిచింది. మాంచెస్టర్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్ సమం చేయాలంటే.. భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలుపు అవసరం. ఓటమిపాలయినా, డ్రాగా ముగిసినా ిరీస్ ఇంగ్లండ్ పరం కానుంది. అందుకే భారత్ బ్యాటర్లు, బౌలర్లు ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.
బౌలింగ్ బలహీనంగానే...
భారత జట్టులో బ్యాటర్లు బలంగా కనిపిస్తున్నప్పటికీ, బౌలింగ్ పరంగా బలహీనంగా ఉంది. వికెట్లు సరైన సమయంలో తీయడంలో భారత బౌలర్లు విఫలమవుతున్నారు. నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్లు అంత భారీ స్కోరు చేయడానికి కారణం బౌలర్లు సరైన ప్రదర్శన చేయకపోవడమేనని అందరూ అంగీకరించే విషయమే. బౌలర్లు కట్టుదిట్టంగా బంతిని వేయడమే కాకుండా సరైన సమయంలో వికెట్లు తీస్తే ఇంగ్లండ్ అంత స్కోరు చేసే అవకాశముండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
బ్యాటర్ల వల్లనే...
మరొకవైపు మాంచెస్టర్ మ్యాచ్ లో ఓటమి పాలు కాపాడింది బ్యాటర్లు మాత్రమే. ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి కొంత విదేశీ మైదానంపై ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, పేసర్ అన్హుల్ కాంబోజ్ లను తప్పిస్తారని భావిస్తున్నారు. ఈ ఇద్దరి స్థానంలో వేరే వాళ్లని తీసుకునే అవకాశముంది. ఐదో టెస్ట్ లో బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారా? లేదా ఆడిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో రిషబ్ పంత్ కూడా ఆడే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా గెలవాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఏ రకమైన ప్రదర్శనచేస్తుందన్నది చూడాల్సి ఉంది.