తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినా!!
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఓటమిపాలైంది. ముల్లన్ పూర్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఓటమిపాలైంది. ముల్లన్ పూర్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 51 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. క్వింటన్ డికాక్ 90 పరుగులతో బ్యాటింగ్ లో రాణించగా, ఒట్నీల్ బార్ట్‌మన్ 4 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు. తిలక్ వర్మ 62 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయి ఓటమిని అంగీకరించింది. శుభ్‌మన్ గిల్ తొలి బంతికే వెనుదిరగ్గా, అభిషేక్ శర్మ 17, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఒకవైపు తిలక్ వర్మ పోరాడుతున్నా, మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు.