IPL 2025 : రాజస్థాన్ రాయల్స్ ను వెంటాడుతున్న ఓటములు.. ఢిల్లీకి కలసి వచ్చిన సూపర్ ఓవర్

ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ కాపిటల్స్ ఓడించింది

Update: 2025-04-17 01:52 GMT

చాలా రోజుల తర్వాత ఐపీఎల్ లో సూపర్ ఓవర్ వచ్చింది. ఇరు జట్లు స్కోర్లు సమానం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే సూపర్ ఓవర్ లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ కాపిటల్స్ నే విజయాన్ని వరించింది. గత కొన్ని రోజులుగా విజయం ముఖం చాటేస్తున్న రాజస్థాన్ రాయల్స్ కు మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ కాపిటల్స్ కు మాత్రం వరస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ కాపిటల్స్ ఓడించింది. ఢిల్లీకి ఇది ఐపీఎల్ లో ఐదో విజయం కాగా, రాజస్థాన్ రాయల్స్ కు వరసగా ఐదో అపజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్ లోనూ ఢిల్లీ కాపిటల్స్ దే పై చేయిగా నిలిచింది.

పెద్దగా స్కోరు చేయలేకపోయినా...
తొలుత బ్యాటింగ్ చేసినఢిల్లీ క్యాపిటిల్స్ జట్లు పెద్ద స్కోరు చేయలేకపోయింది. సొంత మైదానంలో అది ఆశించినంత మేరకు రాణించలేకపోయింది.జెక్ ఫ్రేజర్ తొమ్మిది పరుగులకే అవుటయ్యాడు. పోరెల్ 49 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కరుణ్ నాయర్ అనవసరపు పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 38 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. స్టబ్స్ 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అక్షర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సిక్సర్లు, ఫోర్లతో కొంత ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోరు తేగలిగాడు. అక్షర్ పటేల్ 35 పరుగులు చేశఆడు. అశుశోష్ పదిహేను పరుగులు చేయడంతో ఢిల్లీ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఛేదనకు దిగిన...
తర్వాత ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ లో బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ 51 పరుగులు చేసి అవుటయ్యాడు. శాసంన్ 31 పరుగులు చేసి పక్క టెముకల నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వైదొలిగాడు. పరాగ్ ఎనిమిది, నితీష్ రాణా 51, ధ్రువ్ జురెల్ 26 పరుగులు చేశాడు. హెట్ మయర్ నాటౌట్ గా నిలిచి ఇరవై ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో ఇరు జట్లు సమానంగా స్కోరు చేయడంతో సూపర్ ఓవర్ ను నిర్వహించారు. అయితే సూపర్ ఓవర్ లో ఢిల్లీ కాపిటల్స్ దే పై చేయి అయింది. కేఎల్ రాహుల్, స్టబ్స్ ఫామ్ తో ఉండటంతో వారు సూపర్ ఓవర్ లో ఢిల్లీ కాపిటల్స్ ను విజయపథాన నడిపించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి మూట కట్టుకుంది.
Tags:    

Similar News