IPL 2025: ప్లేఆఫ్ కు చేరామన్న ధీమా కావచ్చు.. ఈ ఓటములేంది సామీ?

జైపూర్ లో జరిగిన మ్యాచ్ లోనూ పంజాబ్ కింగ్స్ ను ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఓడించింది.

Update: 2025-05-25 02:15 GMT

ఐపీఎల్ లో ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు జట్లు ప్లే ఆఫ్ రేసుకు చేరుకున్నాయి. ప్లే ఆఫ్ కు గుజరాత్ టైటాన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు చేరుకున్నాయి. మిగిలిన జట్లు ఈ పోటీ నుంచి నిష్క్రమించినట్లే. మరి ఏమయిందో ఏమో తెలియదు కానీ, ఇప్పటి వరకూ బాగా రాణిస్తున్న జట్లకు ప్లేఆఫ్ నుంచి వైదొలిగిన జట్లు షాక్ లు ఇస్తున్నాయి. మొన్న గుజరాత్ టైటాన్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది. అలాగే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టును హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు మట్టి కరిపించింది. తాజాగా నిన్న జైపూర్ లో జరిగిన మ్యాచ్ లోనూ పంజాబ్ కింగ్స్ ను ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఓడించింది.

ధాటిగా ఆడినా...
ప్లే ఆఫ్ కు చేరామన్న అతి ఉత్సాహమో.. ధీమా తెలియదు కానీ ప్లేఆఫ్ రేసుకు చేరిన తర్వాత ఓటముల బాట వరసగా పడుతున్నాయి. గతంలో తాము గెలిచిన జట్లే వాటిని ఓడిస్తుండటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రియాంశ్ ఆర్య ఆరు పరుగులకే అవుటయ్యాడు. తర్వాత ప్రభ్ సిమ్రాన్ కూడా 26 పరుగులకే వెనుదిరిగాడు. ఇంగ్లిస్ 32 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రం కొంత మంచి ఇన్నింగ్స్ ఆడి యాభై మూడు పరుగులు చేశాడు. వధేరా పదహారు పరుగులు చేశాడు. శశాంక్ పదకొండు పరుగులకే అవుటయ్యాడు. స్టయినిస్ నలభై నాలుగు పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరు లభించింది. మొత్తం ఇరవై ఓవర్లలో పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.
అలవోకగా అధిగమించి...
206 పరుగుల లక్ష్యమంటే పెద్దదే. అయినా సరే ఢిల్లీ నింపాదిగా ఆడింది. ఛేదనలో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు.కేఎల్ రాహుల్ 35 పరుగులు చేశఆడు. డుప్లెసిస్ 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. కరుణ్ నలభై నాలు పరుగులు చేశాడు.అటల్ ఇరవై రెండు పరుగులు చేసి అవుటయ్యాడు.రిజ్వి యాభై ఎనిమిది పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. స్టబ్స్ కూడా నాటౌట్ గా నిలిచి పద్దెనిమిది పరుగులు చేయడంతో అనుకున్న లక్ష్యాన్ని ఢిల్లీ కాపిటల్స్ అధిగమించింది. ఢిల్లీ కాపిటల్స్ మొత్తం 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి ప్లే ఆఫ్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ ను ఓడించగలిగింది.







Tags:    

Similar News